Hyderabad KPHB: హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలని KPHBలోని ఓ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలపారు.
కేపీహెచ్ బీ లోని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో విష్ణువర్ధన్ కి ప్రదక్షిణలు చేస్తున్నాడు. గుడిలోకి రావడం, స్వామి వారికి ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇంతలోనే విష్ణకు కాస్త అలసటగా అనిపించింది. దీంతో విష్ణు ఆలయంలో వన్న ఫిల్టర్ వద్దకు వెళ్లి నీరు కూడా తాగాడు.. ఆ తరువాత మళ్లీ ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆలయ అర్చకులు, భక్తులు విష్ణుని లేపడానికి ప్రయత్నించారు. అయినా విష్ణులో ఎలాంటి చలనం లేనందుకు చివరకు 108 సహాయంతో ఆసుతప్రికి తరలించారు. విష్ణుని పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. స్థానిక సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణు మృతి చెందిన సంఘట అంతా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. విష్ణుకి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విష్ణు విగతజీవిగా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కార్తీక మాసం కావడంతో ఉదయం స్వామి వారి దర్శనానికి వెళ్లడని, కానీ ఇలా విగత జీవిగా వస్తాడని ఊహించలేక పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన వయసుకుని హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటని బోరున విలపించారు. ఎదిగిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటూ ఇలా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడంటూ కన్నీరు పెట్టుకున్నారు. విష్ణు మృత దేహంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Astrology: నవంబర్ 12, మంగళవారం దినఫలాలు