Warangal: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు. విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐఎఎస్ పై దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తామన్నారు.
కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పేరుతో సైబర్ మోసం చేసే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు.. 88819 42520 నెంబర్ కి కలెక్టర్ ఫొటోను డీపీగా పెట్టిన కేటుగాళ్లు.. కాకినాడ జిల్లా పరిధిలోని కొందరు ఎమ్మార్వోలకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టారు.. తాను అత్యవసర మీటింగ్ లో ఉన్నానని.. డబ్బులు తిరిగి రెండు రోజుల్లో రిటర్న్ చేస్తానని మెసేజ్‌లు పెట్టిన కేటుగాళ్లు.