Site icon NTV Telugu

MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.. జూన్ 2న కవిత కొత్త పార్టీ..?

Raghunandhan

Raghunandhan

MP Raghunandan Rao: మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఎపిసోడ్ ని ఫ్యామిలీ డ్రామాతో పోల్చారు. తెలంగాణలో దేవుళ్ళు ఉన్నారా దెయ్యాలు ఉన్నాయా అన్న విషయంపై చర్చ జరుగుతుంది.. దేవుడి పక్కన దెయ్యం ఉంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని వాళ్లే నాటకం ఆడుతున్నారు.. ఒకరితో గొడవ పడితే మరొకరి దగ్గరికి పోయేలా గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు.. మాట్లాడుకోవాలంటే తండ్రి, కూతురి మధ్య మధ్యవర్తి ఎందుకు వస్తారు అని అడిగారు. నా రాజకీయ పరిజ్ఞానం ప్రకారం కవిత సొంత పార్టీ పెట్టాలని ఫిక్స్ అయ్యింది.. జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ పెట్టవచ్చు.. తర్వాత పాదయాత్ర చేయొచ్చు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.

Read Also: CSMIA: ముంబై ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. వ్యక్తి అరెస్ట్

అయితే, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇంతకు ముందు కూడా కామెంట్ చేశారు. కవిత కాంగ్రెస్ లోకి వెళ్తుందని.. వైఎస్ షర్మిళ తరహాలోనే కవిత కూడా పార్టీ నుంచి బయటకు వస్తుందని గతంలో వ్యాఖ్యానించారు. ఈ సారి ఏకంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే కవిత పార్టీ పెడుతుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏదైనా స్పష్టమైన సమాచారంతో ఆ కామెంట్స్ చేశారా లేక రాజకీయ విమర్శల్లోనే భాగమా అనేది రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కవిత తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది.

Exit mobile version