MP Joginipalli Santosh Kumar Donated 50 Lakhs For Petlaburj Hospital Development: పెట్లబుర్జు దవాఖాన అభివృద్ధికి గాను రూ.1 కోటి ఇస్తానని గతంలో తాను ఇచ్చిన హామీని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ నిలబెట్టుకున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మొదటి విడతగా రూ.50 లక్షల మంజూరీ పత్రాన్ని ఈరోజు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ఆసుపత్రి సుపరింటెండెంట్ డాక్టర్ పి. మాలతికి అందజేశారు. మిగతా రూ.50 లక్షలను వచ్చే ఆర్ధిక సంవత్సరం నిధుల నుండి విడుదల చేస్తానని ఆయన తెలిపారు. పెట్లబుర్జు ఆసుపత్రి అభివృద్ధికి ఎల్లవేలల అండగా ఉంటానని, తనతో పాటు తన మిత్రులు కూడా ఆసుపత్రి అభివృద్ధికి సహకరించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఆస్పత్రికి తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని, ఎందుకంటే తాను ఇక్కడ జన్మించానని సంతోష్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్ తాను జన్మించిన దవాఖాన అభివృద్ధి పట్ల చూపించిన ఆసక్తి, మిగతా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Naveen Case: నవీన్ హత్య కేసులో మరో కొత్త మలుపు.. వెలుగులోకి సంచలన నిజాలు
కాగా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త అయిన జోగినిపల్లి సంతోష్ కుమార్, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇందుకు గాను ఆయనకు కొన్ని అవార్డులు కూడా లభించాయి. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఓ కీలక ప్రకటన కూడా చేశారు. కేసీఆర్ తలపెట్టిన కొండగట్టు ఆలయ పునర్నిర్మాణ ప్రక్రియలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం.. వెయ్యు ఎకరాలకుపైగా అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు.
Devika Case Judgement: దేవికా కేసులో నిందితుడికి జరిమానా, జీవిత ఖైదు