Harihara Krishna Friend Reveals Shocking Truths About Naveen Case: అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగిన నవీన్ హత్య కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసుకి సంబంధించి కొన్ని సంచలన విషయాలను నిందితుడు హరిహర కృష్ణ స్నేహితుడు హసన్ వెల్లడించాడు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో జేఎన్ఆర్ఎమ్ కాలనీకి చెందిన హసన్ మాట్లాడుతూ.. ‘‘నవీన్‌ను చంపిన తర్వాత రాత్రి 12:20 గంటలకు హరిహర కృష్ణ నాకు ఫోన్ చేశాడు. ఇంటి వద్దకు వచ్చానని, బయటకు రావాలని అన్నాడు. ఎందుకు వచ్చాయని అడిగితే, నవీన్‌ను హత్య చేసిన విషయం చెప్పాడు. మద్యం మత్తులో అతడ్ని హతమార్చినట్లు వెల్లడించాడు. అప్పటికే బాడీ పార్ట్స్‌ను పడేసి వచ్చినట్లు తెలిపాడు. పోలీసులకు లొంగిపోవాలని ఎంత చెప్పినా అతడు వినలేదు. తన తండ్రికి చెప్పిన తర్వాత లొంగిపోతానని అన్నాడు. తనకొక డ్రెస్ కావాలని అడిగితే, నేను విడిచిన డ్రెస్ ఇచ్చాను. రాత్రి అక్కడే పడుకొని, ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు వెళ్లిపోయాడు. తుర్కయంజల్ మీదుగా హస్తినాపురం వెళ్లి, తన ప్రేయసిని కలిసినట్టు కృష్ణ తెలిపాడు. ప్రేయసిని కలిసిశాక తండ్రికి జరిగిన విషయం చెప్తానన్న కృష్ణ.. అక్కడి నుంచి వరంగల్ వెళ్లాడు. అప్పటినుంచి నాకు టచ్‌లో లేడు’’ అంటూ చెప్పుకొచ్చాడు. హరిహర కృష్ణ లొంగిపోయిన తర్వాత పోలీసులు తన ఇంటికి వచ్చి విచారించారని హసన్ పేర్కొన్నాడు. మృతుడు నవీన్‌కి గంజాయి అలవాటు ఉందని, హరిహర కృష్ణకు కేవలం మద్యం అలవాటు ఉందని తెలియజేశాడు. కళాశాలలో ఉన్నప్పుడు కృష్ణ మంచివాడిగానే ఉండేవాడని, కేవలం అమ్మాయి కోసమే అతడు నవీన్‌ను హత్య చేశాడని వివరించాడు. పోలీసులకు హరిహర కృష్ణ ఏం చెప్పాడో తానూ అదే చెప్పానని హసన్ తెలిపాడు.
Air India: మరో వివాదంలో ఎయిర్ ఇండియా.. ఈ సారి ఫుడ్లో పురుగులట
కాగా.. ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులైన నవీన్, హరిహర కృష్ణ ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. తొలుత కృష్ణ ఆమెను ప్రేమించగా, మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో నవీన్ ఆమెకు దగ్గరవ్వగా.. ఆ అమ్మాయి కూడా అతడ్ని ప్రేమించింది. అది చూసి సహించలేకపోయిన కృష్ణ.. నవీన్‌ను చంపాలని మూడు నెలల నుంచి ప్లాన్ వేశాడు. ఫిబ్రవరి 17వ తేదీన తామిద్దరం కలవడంతో, అదే రోజు చంపాలని కృష్ణ ఫిక్స్ అయ్యాడు. నవీన్‌ను హాస్టల్‌కు డ్రాప్ చేయడానికి వెళ్లినప్పుడు, మార్గమధ్యంలో కృష్ణ అతడ్ని చంపేశాడు. నవీన్‌ను హత్య చేసిన విషయాన్ని కృష్ణ తన ప్రేయసికి ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాదు.. ఒక్కో భాగాన్ని కట్ చేస్తూ, ఆమెకు ఫోటోలు కూడా పంపించాడు.
MLC Kavitha: ప్రీతి పేరెంట్స్‌కి కవిత లేఖ.. అండగా ఉంటామని హామీ