Motkupalli Narasimhulu: నేనేమీ సన్యాసిని కాదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motkupalli Narasimhulu Says He Is Ready To Contest In Next Elections: ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉండటానికి తానేమీ సన్యాసిని కానంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్ఛితంగా పోటీ చేస్తానని అన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నానన్నారు. అయితే.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కేసీఆర్ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. తనపై కేసీఆర్ ఆశీస్సులు కచ్ఛితంగా ఉంటాయన్నారు. ఆలేరు నియోజకవర్గం నుండి తాను 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. గతంలో తనకు ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వకపోయినా.. ఆలేరు ప్రజలు తనని గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఆలేరు నుండి కేసీఆర్ ఎవరికీ అవకాశం ఇచ్చినా.. బీఆర్ఎస్ పార్టీ కచ్ఛితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం పనిచేసిన వ్యక్తినని, ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే కాళ్లు ఆగడం లేదని వెల్లడించారు. ఆలేరు ప్రజలకు ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. కాగా.. తన పుట్టినరోజు సందర్భంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మోత్కుపల్లి ప్రకటించిన విషయం తెలిసిందే.
Anand Devarakonda: అనసూయ- విజయ్ గొడవ.. కుక్కలు అలాగే కొట్టుకుంటాయి అన్న ఆనంద్
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ఇదిలావుండగా.. ఆలేరులో 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మోత్కుపల్లి. 2009 ఎన్నికల్లో తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కానీ.. 2014లో మాత్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతు అవ్వడంతో.. 2018లో బీఎల్ఎఫ్ తరపున ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అప్పటి నుంచి పార్టీ హైకమాండ్ ఆయన్ను పక్కనపెట్టేసింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తన మనసులోని మాట బయటపెట్టారు.
Revanth Reddy: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. ఉచిత విద్యుత్ పేరుతో దోచుకుంటున్నారు
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!