Anand Devarakonda: అనసూయ- విజయ్ గొడవ.. కుక్కలు అలాగే కొట్టుకుంటాయి అన్న ఆనంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Devarakonda: పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి .. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఇక అన్న స్టార్ డమ్ ను పట్టుకొని తమ్ముడు ఆనంద్ దేవరకొండ సైతం దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక సినిమాలోకి రావడం ఎవరి వలన వచ్చినా.. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నిలబడడం చాలా ముఖ్యమని తెలుసుకున్న ఆనంద్.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నాడు. అందులో ఒకటి బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆనంద్ దేవరకొండ.. సినిమా విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆనంద్.. అనసూయ- విజయ్ ల మధ్య జరిగిన గొడవపై స్పందించాడు.
Shah Rukh Khan: విజయ్ ఒక పిచ్చి నటుడు.. షారుఖ్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
అనసూయ – విజయ్ దేవరకొండ మధ్య జరుగుతున్న వివాదం గురించి అందరికీ తెల్సిందే. సోషల్ మీడియాలో ఆమె, విజయ్ పై కామెంట్స్ చేయడం.. దానిని విజయ్ ఫ్యాన్స్ తిప్పి కొట్టడం జరుగుతూనే ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే బేబీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు.. ట్రైలర్ నచ్చిందని, ఆనంద్ దేవరకొండ చాలా ఇంటెన్స్ గా ఉన్నాడని చెప్పుకొచ్చింది. దీంతో అన్నను తిట్టి.. తమ్ముడు ను పొగుడుతుంది ఏంటి అంటూ విమర్శలు వచ్చాయి. ఇక వీటిపై ఆనంద్ స్పందించాడు. ” అనసూయ మా సినిమా గురించి ట్వీట్ చేసిన విషయం నాకు తెలియదు. విజయ్- అనసూయ మధ్య ఏం గొడవ జరిగిందో నాకు తెలియదు. నాకు తెలిసి ఇష్యూ ఏం లేదు.. ఒక సైడ్ నుంచే కామెంట్రీ ఉంది. మీరు చెప్తేనే నాకు బేబీ గురించి ట్వీట్ చేసిన విషయం తెలిసింది. బోల్డ్ కామెంట్స్ చేయడం ట్విట్టర్ లో ఇప్పుడు అంతా కామన్ అయిపొయింది. సోషల్ మీడియాలో ఒక మీమ్ ఉంటుంది. ఒక గేటుకు అటువైపు, ఇటువైపు రెండు కుక్కలు కొట్టుకుంటూ ఉంటాయి. తీరా చేస్తే ఆ గేటు కు గోడ ఉండదు. అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది.. ఆ రెండు కుక్కలు పక్కకు వచ్చి ఎదురెదురు కొట్టుకోవచ్చు. కానీ, రావు. ఆ గేట్ గ్రిల్ వద్దనే అరుస్తాయి. అది సోషల్ మీడియా. రియల్ లైఫ్ లో నడుస్తూ ఎదురుగా వచ్చేవాడి మీద కామెంట్స్ చేయం.. మనలోకం మనది.. మన పని మనది. ఇలాంటి పేరు ఎందుకు పెట్టుకున్నామని అడగలేము.. అదే ట్విట్టర్ లో అయితే ఏం పేరు ఇది అని ఏకిపారేస్తాం.. సోషల్ మీడియా గురించి నేనేమంటానంటే .. మనం ఎవ్వరం ఎస్ చెప్పలేం కానీ, అందులో జాయిన్ అయిపోతాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!