More Than 92 Percent Students Attend Polycet Exams: తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లోని 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిఫ్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్-2023కి 92.94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ర్ట వ్యాప్తంగా బుధవారం 296 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షను నిర్వహించారు. ఇంజనీరింగ్, డిఫ్లమా కోర్సులతోపాటు వ్యవసాయ, ఉద్యానవన మరియు వెటర్నరీ డిఫ్లమా కోర్సుల్లో కూడా పాలీసెట్ ద్వారానే ప్రవేశాలను చేపట్టనున్నారు. పరీక్షకు రాష్ర్ట వ్యాప్తంగా 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 98,273 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో 92.94 శాతం మంది హాజరయ్యారు. పరీక్షకు 58,520 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 54,700 మంది హాజరయ్యారు. బాలికలు 47,222 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 43,573 మంది హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికల కంటే బాలురు ఎక్కువగా ఉన్నారు. ఫలితాలను 10 రోజుల్లో విడుదల చేయనున్నారు.
Sunil Deodhar: దాన్ని అంతం చేసేందుకు.. జనసేన, బీజేపీ కలిపి పోరాడుతాయి