ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్ ఇప్పుడు దేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. ఆ వ్యక్తి ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలిసింది. 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో, అతన్ని హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ వ్యక్తికి 20వ తేదీన అతనికి జ్వరం, 23వ తేదీ నాటికి దద్దుర్లు రావడంతో మరుసటి రోజు ఉదయం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లాడు. ఈనేపథ్యంలో.. అక్కడి డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి, కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. మరీ.. అక్కడ్నుంచి 108లో హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు.
read also: Polycet 2022: ఏపీ పాలీసెట్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
అయితే.. మంకీపాక్స్ లక్షణాలతో హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చేరిన రోగి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ వెల్లడించారు. చేతులు, కాళ్లు, ఛాతీపై దద్దుర్లు ఉన్నాయని.. నీరసం, కాస్త జ్వరం ఉందని తెలిపారు. అతని శరీరంపై ఉన్న దద్దుర్లు మంకీపాక్స్లాగే ఉన్నాయన్న ఆయన.. వైరస్ నిర్ధారణ కోసం రోగి నుంచి 5 రకాల శాంపిల్స్ సేకరించినట్లు వివరించారు. వాటిని పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపనున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రానికి బాధితుడి వైద్య పరీక్షల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మంకీపాక్స్ గురించి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉన్న వారికే మంకీపాక్స్ సోకే అవకాశం ఉందన్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోకదని, పెద్దగా దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారానే సోకే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రోగికి దగ్గరగా ఉన్న ఆరుగురిని ఐసోలేషన్‌లో ఉంచామని, మంకీపాక్స్ లక్షణాలలు 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతాయని డాక్టర్ శంకర్ తెలిపారు.
Flood Relief Fund : భద్రాద్రిలో వరద బాధితులకు ఎమ్మెల్యే సండ్ర అధ్వర్యంలో సహాయం