Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం సేకరించిన సిట్
- మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు వేగం
- రోహిత్ రెడ్డి విదేశీ ప్రయాణాలపై ఫోకస్
- ఫార్మ్‌హౌస్ పార్టీలపై లోతైన విచారణ
- వ్యాపారులు, రాజకీయ నేతల లింకులపై ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ ఫార్మ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) దర్యాప్తును ముమ్మరం చేస్తూ కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో భాగంగా ముగ్గురు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న అధికారులు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరిపారు. ముఖ్యంగా రోహిత్ రెడ్డి గత ఐదు నెలల కాలంలోనే సుమారు 10 సార్లు దుబాయ్ వెళ్లినట్లు సిట్ గుర్తించింది, ఈ క్రమంలో అక్కడ జరిగిన డ్రగ్స్ పార్టీల వ్యవహారాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో మొయినాబాద్ ఫార్మ్‌హౌస్‌లో జరిగిన పార్టీల్లో ఎవరెవరు పాల్గొన్నారు అనే అంశంతో పాటు, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమితా శర్మతో రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలపై కూడా సిట్ బృందం కూపీ లాగుతోంది.
Bengal hostage row: ఎంఐఎం నాయకుడే మల్దా ఘటన సూత్రధారి.. పారిపోతుండగా అరెస్ట్..
Also Read
రెండోసారి కస్టడీ విచారణలో భాగంగా కాల్పుల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, ఆ రోజు జరిగిన మీటింగ్‌లో వ్యాపారులు , రాజకీయ నేతలు ఏయే అంశాలపై చర్చించారు అనే దానిపై నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయ నేతలు , వ్యాపారవేత్తల మధ్య జరిగిన ఈ చర్చల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. నిందితుల మూడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో, పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. సిట్ సేకరించిన ఈ కీలక సమాచారంతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
AP Weather Alert: అలర్ట్.. 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!