ప్రధానితో జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల భేటీ నేపథ్యంలో ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీజీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? ఎన్జీవోనా అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. కార్పొరేటర్లు కమ్యూనిటీ సేవ చేయాలన్న వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు రావాల్సిన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ విమర్శించారు. నిధులు మాత్రం గుజరాత్‌కు, హైదరాబాద్‌కు మాటలా మోదీజీ అంటూ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.…