Harish Rao: యాదాద్రి, కొండగట్టు తరహా ఏడుపాయలు ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దుర్గమ్మ తల్లికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను మంత్రి హరిశ్ రావు సమర్పించారు. వేద పండితుల నడుమ పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు ఆలయాధికారులు. వనదుర్గ సన్నిధిలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలిసి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏడుపాయలకు ప్రతియేటా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
Read also: Krishna Water: కృష్ణా నీటిపై రెండు రాష్ట్రాల రగడ.. వాటా ఖరారు చేయాలని తెలంగాణ డిమాండ్
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని అన్నారు. యాదాద్రి ని అద్భుతంగా తీర్చిదిద్దామని, కొండగట్టుకు రూ 1000 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాలను తెలంగాణ సర్కార్ అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు గర్వించే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ బడ్జెట్ లో దేవాలయ అభివృద్ధికి కృషిచేస్తున్నామని, వేద పండితులు, బ్రాహ్మణుల సంక్షేమానికి కృషిచేస్తుందని మంత్రి అన్నారు. దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నామని, హిందుధర్మ పరిరక్షణకోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు.
Read also: Flyovers Shutdown: నేడే మహా శివరాత్రి, షబ్ ఈ మేరజ్.. నగరంలోని ఫ్లై ఓవర్లు బంద్
వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల దేవాలయానికి భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి పండుగ సంద్భంగా చారిత్రక కట్టడమైన రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల దేవాలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమై భక్తులచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు మహా వైభముగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునుండే రుద్రేశ్వరుడికి అభిషేకం చేసేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వెయ్యి స్తంభాల గుడికి ఎక్కువ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యం నగరం ట్రాఫిక్ ను మళ్లించారు పోలీసులు. వరంగల్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో మహాశివరాత్రి సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వెయ్యి స్తంభాల గుడి దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read also: Maha Shivratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
ములుగు, పరకాల నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాలు ములుగు రోడ్డులోని పెద్దమ్మగడ్డ, కేయూసీ జంక్షన్, సీపీవో నుంచి అంబేడ్కర్ జంక్షన్ మీదుగా హనుమకొండ బస్టాండ్ కు చేరుకోవాలి. హనుమకొండ నుంచి ములుగు, కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు శ్రీదేవి ఏషియన్మాల్, అంబేడ్కర్ సెంటర్, సీపీవో పాయింట్ నుంచి కేయూసీ మీదుగా వెళ్లాలని సూచించారు. హనుమకొండ బస్టాండ్ నుంచి నర్సంపేట, తొర్రూరు, భద్రాచలం వైపు వెళ్లే వాహనాలు బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్డు మీదుగా వెళ్లాలి. వరంగల్ బస్టాండ్ నుంచి పోస్టాఫీస్, శివనగర్, పోతనరోడ్డు, సంతోషిమాత దేవాలయం, సీఎస్ఆర్ గార్డెన్, అదాలత్ నుంచి. హనుమకొండ, ఇతర ప్రాంతాలకు వెళ్లాలి. ములుగు క్రాస్ రోడ్డు నుంచి హనుమకొండకు.. అలంకార్, కాపువాడ మీదుగా వెళ్లాలి. హనుమకొండ నుంచి వరంగల్ వైపునకు.. మార్కజీ పాఠశాల, కొత్తూర్ జెండా మీదుగా పెద్దమ్మగడ్డ ద్వారా చేరుకోవాలని సూచించారు.
Rajanna Temple: రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు.. చెరువు ప్రాంతంలో దిగేందుకు..