Jogi Ramesh : విశాఖలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం వ్యాపారంలో జరుగుతున్న కుంభకోణాలు, డైవర్షన్ రాజకీయాలు, మరియు ఆయనపై ఎదురవుతున్న మద్యం కేసులపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, “నన్ను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కానీ నిజానికి మద్యం కుంభకోణాన్ని బట్టబయలు చేసింది మా పార్టీనే. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా చీఫ్ పాలిటిక్స్ ను వేరే దిశలో మలిచే ప్రయత్నం…
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు ఈడీ షాకిచ్చింది. మద్యం కేసులో భూపేష్ బాఘేల్ కుమారుడు చైతన్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది.
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని.. ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మాజీ ప్రభుత్వ విప్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కిందట ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ద్వారా ఎనిమిది కోట్లు పట్టుకున్నట్టు తెలిసిందని.. తనిఖీల్లో 8 కోట్ల రూపాయలు దొరికితే, దానికి అన్ని ఆధారాలు సమర్పించారన్నారు.
మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు (ఏప్రిల్ 18న) విచారణకు రావాల్సిందిగా సూచించారు. విచారణకు వచ్చి తన దగ్గర ఉన్న వివరాలు ఇవ్వాల్సిందిగా అతడిని సిట్ కోరింది.
హైదరాబాద్‌లో రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసులపై సిట్ సోదాలు నిర్వహించింది. మద్యం స్కాంలో రాజ్ కసిరెడ్డి కోసం రేపు కూడా హైదరాబాద్‌లో సిట్ ఉండనుంది. ఇవాళ మూడు చోట్ల గాలించినా కసిరెడ్డి ఆచూకీ లభించలేదు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కసిరెడ్డి డైరెక్టర్ గా ఉన్నట్టు సమాచారం అందటంతో సిట్ అక్కడకి వెళ్లినా ఫలితం లభించలేదు. కసిరెడ్డి భాగ్యనగరంలోనే ఉన్నారని పక్కా సమాచారం అందటంతో మరో 2 రోజులు గాలింపు చర్యలు చేపట్టాలని సిట్ నిర్ణయం తీసుకుంది. తనిఖీల…
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ శుక్రవారం ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యారు. తాజాగా సుప్రీంకోర్టుపై కవిత ఆశలు పెట్టుకున్నారు.
Breaking News CBI Kavitha: ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో భాగంగా కవితనే కీలక సూత్రధారి అని ఆరోపించిన సీబీఐ.. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులను సమకూర్చడం లాంటి పనులు చేసిందని తెలిపింది. ఇలా ప్రతిదీ కవిత కనుసన్నల్లోనే జరిగాయని., ఈ కేసులో ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం…
Liquor Policy Case: ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఆరోపించింది సీబీఐ. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులను సమకూర్చడం.. ఇలా ప్రతిదీ కవిత కనుసన్నల్లోనే జరిగాయని అభియోగం గావించింది. ఈ కేసులో ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐ…