MLC Kadiyam Srihari: సర్పంచ్ నవ్య రాజయ్య అంశంపైన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పందించారు. జనగామ జిల్లా జఫర్గడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా పోలీసుల ద్వారా విచారణ జరిపిస్తున్నారని స్పష్టం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత పార్టీ పరంగా నిర్ణయాలు ఉంటాయని అన్నారు. వచ్చిన ఆరోపణల నిజమా కాదా అని తెలకుండా ఏమి చర్యలు తీసుకోరని అన్నారు. ప్రభుత్వపరంగా జరుగుతున్న విచారణలో నిజమేమిటిదో తెలుస్తుందని తెలిపారు. వార్తల్లో వచ్చిన సమాచారం తో ఎవ్వరి పైన చర్యలు ఉండవని అన్నారు.
Read also: Dharmapuri Arvind: మెజార్టీ స్థానాల్లో గెలుస్తాం.. మా స్ట్రాటజీ మాకుంది
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీరు,త్రాడునీరు అందించాలనే ఉద్దేశంతో 2003 లో పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అశ్రద్ద వల్ల సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని అన్నారు. వరంగల్ జిల్లా పొన్నాల భారీ నీటి పారుదల మంత్రిగా ఉన్న న్యాయం జరుగలేదని ఆరోపించారు. ఉద్యమ నాయకుడే కేసీఅర్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. వ్యవసాయానికి ప్రోత్సహం అందిస్తూనే సాగునీటిని అందిస్తున్న ఘనత కేసీఆర్ ది అని అన్నారు. ఒక్కప్పుడు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా దిగుబడి రాలేదని.. ఇప్పుడు జనగామ జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని కడియం శ్రీహరి తెలిపారు.
Devara: ఎన్టీఆర్ కి సోలో రిలీజ్ కష్టమే… పోటీగా పాన్ ఇండియా సినిమా