యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సముద్రం బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది. బిగ్గర్ కాన్వాస్, బిగ్గర్ యూనివర్స్ లో దేవర రూపొందుతుంది. అనౌన్స్మెంట్ తోనే హైప్ పెంచిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన ఎన్టీఆర్, ఆర్ ఆర్ ఆర్ తో వచ్చిన క్రేజ్ ని మరింత పెంచుకునే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ అవుతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో తెలుగు నుంచి ఏప్రిల్ 5నే పెద్ద సినిమాలేవి దేవరకి పోటీగా రావట్లేదు. ఇప్పటివరకూ అనౌన్స్ చేసిన వాటిలో కూడా సౌత్ నుంచి పెద్ద సినిమాలు ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వట్లేదు. దీంతో ఎన్టీఆర్ కి సోలో రిలీజ్ దొరుకుతుందని అంతా అనుకున్నారు కానీ సడన్ గా హిందీ నుంచి ఒక పాన్ ఇండియా సినిమా ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి వస్తున్నట్లు అనౌన్స్ చేసారు.
ఇటీవలే ది కేరళ స్టోరీ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు సుదీప్తో సేన్, తన నెక్స్ట్ సినిమా ‘బస్తర్’ని అనౌన్స్ చేసాడు. ఈ మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చెయ్యనున్నారు. ది కేరళ స్టోరీ సినిమాతో నార్త్ లో సుదీప్తో సేన్ కి క్రేజ్ పెరిగింది, అతని నుంచి సినిమా వస్తుంది అంటే నార్త్ బెల్ట్ లో మంచి థియేటర్స్ లభించే అవకాశం ఉంది. 16 కోట్ల బడ్జట్ తో 230 కోట్లు రాబట్టాడు అంటే సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీ సినిమాతో ఎంత పెద్ద హిట్ కొట్టాడో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం నార్త్ లో ఉన్న ఒక ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని చూస్తే బస్తర్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ లభించే అవకాశం ఉంది. దీంతో దేవర సినిమాకి బస్తర్ నుంచి థియేటర్స్ విషయంలో పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది.