చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగు తూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.
read also : ఏపీలో కర్ఫ్యూ నిబంధనల్లో మరిన్ని సడలింపులు
అయితే… తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా కరోనా లక్షణాలతో… ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ రావడంతో …హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు జీవన్ రెడ్డి.