ఏపీ క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల్లో మ‌రిన్ని సడ‌లింపులు

ఏపీ సీఎం జ‌గ‌న్ ఇవాళ క‌రోనా పరిస్థితులపై స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఇస్తున్నట్టు సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. రాత్రి 9 వ‌ర‌కు దుకాణాలు మూసివేయాల‌ని అన్నారు. రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని అన్నారు. స‌డ‌లింపుల స‌మయంలో 144 సెక్షన్ అమ‌లు చేస్తున్నట్టు తెలిపారు.

read also : సొషల్ మీడియాలో కామెడీగా మారిన అక్షయ్ ‘ఏడుపు’ డ్యాన్స్!

మాస్క్ పెట్టుకొకుండా తిరిగేవారిని గుర్తించేందుకు వాట్సప్ నెంబ‌ర్ అందుబాటులోకి తీసుకురావాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎవ‌రైనా మాస్క్ పెట్టుకొన‌ని వ్యక్తి ఫొటోను వాట్సప్‌కు పంపితే వారికి జ‌రిమానా విధించేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. క‌రోనా ఆంక్షల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. ప్రతి దుకాణంలో ప‌నిచేసే వ్యక్తులు, వినియోగదారులు అంద‌రూ త‌ప్పనిస‌రిగా మాస్క్ ధ‌రించాల్సిందేన‌ని తెలిపారు. మాస్క్ లేకుంటే రూ.100 జ‌రిమాన విధించాల‌ని ఆదేశించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-