పశ్చిమ బెంగాల్ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో జరుగుతున్న వివాదం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎస్.ఐ.ఆర్ పరిధిలోకి వచ్చే ఓటర్ల పేర్లను బహిరంగంగా ప్రదర్శించాలని భారత ఎన్నికల సంఘాన్ని (ECI) అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ముఖ్యంగా ఎస్.ఐ.ఆర్ పరిధిలోకి వస్తారంటూ ఎవరికైతే నోటీసులు జారీ చేయబడ్డాయో, అటువంటి వ్యక్తుల జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీలు, బ్లాక్ కార్యాలయాలు , వార్డు కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ఉంచాలని స్పష్టం చేసింది.
Rinku Singh: టీ20 వరల్డ్ కప్‌కు ముందు.. వివాదంలో చిక్కుకున్న రింకూ సింగ్!
ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు , ఎన్నికల సంఘానికి సహకరించేందుకు అవసరమైన సిబ్బందిని వెంటనే సమకూర్చాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా కోర్టు ఆదేశించింది. బెంగాల్ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో అనేక విధానపరమైన అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే, ఈ కేసులో న్యాయస్థానం మరింత లోతుగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో బెంగాల్ రాజకీయాల్లో , ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.
Dasoju Sravan : సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు.!