Commissioner DS Chauhan Pressmeet On Traffic Rules: రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంగళవారం ఎల్బీనగర్‌లోనే సీపీ క్యాంప్ ఆఫీస్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ అధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెడికల్ ఎమర్జెన్సీ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సరైన చర్యలు చేపడుతున్నామని, ఇప్పటిదాకా చాలా వరకు రోడ్డు ప్రమాదాలను తగ్గించామని తెలిపారు.
Anantha Sriram: దివంగత వైఎస్సార్‌ను అవమానపరిచేలా పోస్టులు.. వీడియో రిలీజ్ చేసిన అనంతశ్రీరామ్
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన అధికారులకు క్యాష్ రీవార్డు కూడా అందిస్తున్నామని తెలియజేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనంలో తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఫేక్ నెంబర్ ప్లేట్స్‌పై ఆరు నెలల్లో 60 వేల వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్ సిబ్బందికి విధుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్టీ మేతడ్స్ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన రూ.2 కోట్లతో ట్రాఫిక్ అధికారులకు ట్రాఫిక్ సేఫ్టీ పరికరాలు అందిస్తామన్నారు. ఏసీ హెల్మెట్, ల్యాప్‌టాప్స్, జంగిల్ షూ, వాటర్ బాటిల్స్, రీప్లెక్టీవ్ జాకెట్స్, ఎల్ఈడి బ్యాటన్స్ వంటి మౌలిక సదుపాయాలను ట్రాఫిక్ పోలీసులకు అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Pawan Kalyan: ఒక్క పోస్టు కూడా లేకుండానే పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ రికార్డు.. కానీ?
ఇదే సమయంలో.. మాదక ద్రవ్యాల డ్రైవ్ కొనసాగుతూనే ఉందని డీఎస్ చౌహాన్ వెల్లడించారు. గంజాయి ముఠా సభ్యులలైన ఆరుగురిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. వీళ్లు సీడ్స్ మధ్యలో గంజాయి తరలిస్తున్నారని.. మొత్తం 224 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సీలేరు నుండి మహారాష్ట్రకు ఈ ముఠా సభ్యులు గంజాయి తరలిస్తున్నారన్నారు. నిందితుల నుండి మూడు కార్లు, 6 మొబైల్స్, 2 ఫేక్ నెంబర్ ప్లేట్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ట్రాన్స్‌పోర్టర్ వివేక్ మోహన్ రావుతో పాటు మరో ఐదుగురు అరెస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.