రైతుల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శంషాబాద్ మండలంలోని మల్కారం, గ్రామంలో రైతు వేదిక నిర్వహించిన రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని అన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనతో రైతన్నలు సంతోషంగా వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు.
Also Read : Pic talk : బ్యూటిఫుల్ లెహంగాలో గార్జియస్ లుక్ లో ఆకట్టుకున్న వేదిక..
రైతన్నలకు ఏ బాధ కష్టం లేకుండా మేమున్నామంటూ తెలంగాణ సర్కార్ భరోసా కల్పిస్తుందన్నారు. రైతు బీమా ద్వారా రైతు కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు రైతులకు ఏ కష్టం లేకుండా సమస్యల పరిష్కారం కోసమే రైతు వేదికలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఏ సీజన్లో ఏ పంటలు వేయాలో ఏ పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలు వస్తాయో అధికారుల ద్వారా రైతులకు వివరిస్తుందన్నారు.
Also Read : PM MODI: ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం