రాష్ట్రంలో ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ ప్రకటించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. ఇప్పుడు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయం తన కేడర్ తో సమావేశమయ్యారు ప్రకాష్ గౌడ్.. అయితే, ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ కు సూచించారు పలువురు నేతలు.. దీంతో, తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని విరమించుకొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెనుకడుగు వేశారు.. కార్యకర్తల సూచన మేరకు బీఆర్ఎస్…
Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఆరు నెలల్లో జరగబోతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఇప్పుడు ఇదే తరహా పోరాటం మొదలైందట. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కొడుకు మధ్య మాటల యుద్ధం నడుస్తోందట. సిట్టింగ్‌లకే సీట్లని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. కొన్ని చోట్ల గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తోందట బీఆర్‌ఎస్. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారట. మంత్రి…
దళిత బంధు పథకంతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ దళిత బంధువు పథకం ద్వారా ఎంపికైన 57 మంది లబ్ధిదారులకు 5 కోట్ల 64 లక్షల రూపాయల వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి, డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే అమలు పరుస్తున్నారని…