తమిళ హీరోయిన్ వేధిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తమిళ హీరో రాఘవ లారెన్స్ నటించిన ముని సిరీస్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది..ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. ఇక సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
ఇటీవల కర్ణాటక లో జరిగిన చిత్తారా అవార్డ్స్ లో వేధిక మెరిసింది.. ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది.. ఆ వేడుకలో వేధిక స్కిన్ కలర్ డ్రెస్సులో థైస్ అందాలను చూపిస్తుంది.. డ్రెస్సుకు తగ్గట్లు లైట్ మేకప్ తో, సింపుల్ గా గార్జీయస్ లుక్ లో కనిపించి అందరిని చూపును తనవైపు తిప్పుకుంది.. దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా వేధిక మెరిసింది.. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..
శాండల్‌వుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్లో చిత్తారా అవార్డు వేడుక ఒకటి. 2012లో మొదటి అవార్డు వేడుకను చిత్తారా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్‌గా పరిచయం చేశారు. 2019లో మేము మా ఫస్ట్ స్టార్ అవార్డును ప్రారంభించాము. ఇది 2022లో గ్రాండ్‌గా జరిగింది ఇప్పుడు చిత్తారా స్టార్ అవార్డు మూడవ ఎడిషన్‌లో మేము కన్నడ & భారతీయ సినిమాల్లోని ప్రతిభావంతులు, కొత్త తారలు మరియు సూపర్ స్టార్‌లను సత్కరిస్తారు.. ఇక ఈ ఏడాది కూడా జరిగిన ఉత్తమ క్యాటగిరిలో అవార్డులను అందించారు..