NTV Telugu Site icon

MLA Jeevan Reddy: రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చారు

Mla Jeevan Reddy

Mla Jeevan Reddy

MLA Jeevan Reddy fire on Governor Tamilisai: ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి గవర్నర్‌ తమిళిసై పై మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ ఒక ఫేక్ ఫ్రాడ్ ఎంపీ అంటూ ఆరోపించారు. అర్వింద్ కుటుంబం అవినీతి కుటుంబం అని మండపడ్డారు. ఎంపీ అర్వింద్ ని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో బట్టలు ఉడదీసి ఉరికిచ్చి కొడతామంటా సంచళన వ్యాఖ్యలు చేశారు.
మరో సారి కవిత, కేసీఆర్ లమీద మాట్లాడితే దాడులు చేస్తామని హెచ్చరించారు.

Read also: Andhra Pradesh: రైతులకు శుభవార్త.. ఈనెల 29న ఖాతాల్లో డబ్బులు జమ

బాండ్ పేపర్ రాసి జిల్లా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చారని ఆరోపించారు. గవర్నర్ బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలిగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఆర్మూర్ లో నా మీద పోటీ చేయు, చిత్తుగా ఒడిస్తానంటూ ఎంపీ అరవింద్‌ కు సవాల్‌ విసిరారు. లిక్కర్ స్కామ్ లో టీఆర్‌ఎస్‌ని లాగే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ రంగ విచారణ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఎంపీ అర్వింద్ ని జిల్లాలో తిరగనివ్వమని, అడుగడుగునా అడ్డుకుంటామని తెలిపారు. ఎక్కడికక్కడ దాడులు చేస్తామని హెచ్చరించారు.
New York: న్యూయార్క్ వ్యాప్తంగా భారీ హిమపాతం.. నిలిచిపోయిన ప్రజాజీవనం