Harish Rao: కేంద్రం చేతిలో ఉమ్మడి ప్రాజెక్ట్ లు పెడితే.. తెలంగాణ అడుక్కోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్ అన్నారు. ఉమ్మడి ప్రాజెక్ట్ లు KRMB కి అప్పజెప్పడనికి తెలంగాణ సర్కార్ ఒప్పుకుందని అంటున్నారని మండిపడ్డారు. ఒక వేళ అదే నిజం అయితే తెలంగాణ కు అన్యాయం జరుగుతుందన్నారు. అప్పట్లో KRMB కి ఉమ్మడి ప్రాజెక్ట్ లు అప్పజెప్పడానికి BRS సర్కార్ ఒప్పుకోలేదని తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్ట్ ల అప్పగింతపై కేంద్రం,ఎపి సర్కార్ నుంచి ఒత్తిడి వచ్చేదని అన్నారు. అయిన ఉమ్మడి ప్రాజెక్ట్ లు ఏకపక్షంగా అప్పజెప్పడానీకి తాము ఒప్పుకోమని కేసీఆర్ సర్కార్ తేల్చి చెప్పిందన్నారు. ఉమ్మడి ప్రాజెక్ట్ లు అప్పగించాలని అంటే… కొన్ని షరతులు, డిమాండ్ లను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు KRMB ముందు పెట్టామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సర్కార్ ఉమ్మడి ప్రాజెక్ట్ లు అప్పజెప్పెందుకు రెడీ అయినట్టు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. KRMB కి ఉమ్మడి ప్రాజెక్ట్ లు అప్పగిస్తే తెలంగాణకు అనేక రకాలుగా నష్టాలు వస్తాయని గుర్తు చేశారు.
Read also: Jupally Krishna Rao: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు..
శ్రీశైలం ప్రాజెక్ట్ లో హైడల్ పవన్ జనరేషన్ పై తెలంగాణ హక్కును కోల్పోతామన్నారు. నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభావము పడుతుందని క్లారిటీ ఇచ్చారు. కేంద్రం చేతిలో ఉమ్మడి ప్రాజెక్ట్ లు పెడితే…తెలంగాణ అడుక్కోవల్సి వస్తుందని అన్నారు. వైయస్ జగన్ విజయం సాధించాడని మీడియాలో వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి …రాష్ట్ర హక్కులను కాపాడాలని సూచించారు. KRMB కీ ఉమ్మడి ప్రాజెక్ట్ లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ సర్కార్ అప్పగించవద్దని అన్నారు. కేంద్రంలో బీజేపీ ఒత్తిడి తెస్తోంది…తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఒప్పుకుంటుందన్నారు. మేడీగడ్డ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికీ కూడా నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు …రైతులకు సాగు నీరు ఇవ్వవచ్చన్నారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లో నీరు ఉంది…విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లలో ఇప్పుడు మోటార్ లను అన్ అండ్ ఆఫ్ వాడుతున్నారు… అలా చేస్తే మోటార్లు దెబ్బ తింటాయి.నిపుణుల సలహా తీసుకొని నడపాలని కోరుతున్నామన్నారు.
KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. మొత్తం 420 హామీలు