తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 20 ఏండ్ల పాటు సభలో ఉన్న నేను ఏనాడు ఇతరులతో మాట పడలేదు. సస్పెన్షన్ చేయడంతో పాటు.. అసెంబ్లీ ఆవరణలో ఎప్పుడూ రాని పోలీసు వ్యాన్లు లోనికి వచ్చాయి. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు ఈటల. స్పీకర్ ను మర మనిషి అంటే తప్పా? నేను రాజీనామా ఇస్తా అన్నప్పుడు కనీసం కలిసేందుకు కూడా స్పీకర్ అవకాశం ఇవ్వలేదు.
అసెంబ్లీ సెక్రెటరీకి రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది. రూం కూడా కేటాయించకుండా అవమానించారు. అకారణంగా నన్ను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం దారుణం. బీఏసీ సమావేశాలకు కూడా మమ్మల్ని పిలవలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనలను మాత్రమే స్పీకర్ పాటించారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల కొత్త రుణాలు రైతులకు పుట్టట్లేదు. దీన్ని మేము అడగాలనుకున్నాం. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు ఈటల.
Read Also: Most millionaires in these cities: ప్రపంచంలో ఎక్కువ మంది మిలియనీర్లు ఉంటున్న నగరాలు ఇవే..
కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ నేతలకు రైతుల సమస్యలు అక్కర్లేదు. వారు మాట్లాడరు. కేసీఆర్ చెప్పినట్లుగానే ఈ రెండు పార్టీలు నడుచుకుంటున్నాయి. ఆర్టీసీని ముంచిందే కేసీఆర్ అని కార్మికులు అంటున్నారు. స్పీకర్ సమన్యాయం పాటించలేదు. మరమనిషి అంటేనే కేసీఆర్.. నాకు ఇంత శిక్ష వేశారు.. మరి రండ, లఫుట్, మరగుజ్జు, హౌల గాళ్ళు అన్నందుకు ఎలాంటి శిక్ష వేయాలి? షర్మిల మంచిగా మాట్లాడటం లేదని చర్యలు తీసుకోవాలని అంటున్నారు.. అసలు కేసీఆర్ ఎప్పుడు మంచిగా మాట్లాడిండు?
రాష్ట్రంలో మొట్టమొదటి సంస్కారహీనుడు కేసీఆర్. అసెంబ్లీలో దబాయించే ప్రయత్నం చేశావ్ కదా కేసీఆర్.. బిడ్డా నీ తాటాకు చప్పుళ్లకు భయపడను. నన్ను చంపుతా అని నయిం గ్యాంగ్ బెదిరించినా భయపడలేదు. నాపై గాని, నా కుటుంబంలో వ్యక్తులపై గాని దాడి జరిగి ఒక్క రక్తపు బొట్టు చిందినా బాధ్యత నీదే.. కేసీఆర్ అన్నారు ఈటల. నాపై దాడి జరిగితే అది యావత్ తెలంగాణపై జరిగిన దాడిగా భావిస్తాం. కేసీఆర్ ను ఓడించే వరకు నిద్రపోయేదే లేదు. రోజులు లెక్కపెట్టుకో కేసీఆర్…నీతో ఉన్నవాళ్లు ఎవరూ సంతోషంగా లేరు. సమయం కోసం చూస్తున్నారు.
సోనియా గాంధీని దయ్యం అన్న కేసీఆర్.. ఆమె కాళ్ళు మొక్కాడు. ఇప్పుడు అదే పార్టీతో కాంగ్రెస్ నేతలు దోస్తీ చేస్తున్నారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కేసీఆర్ రండ అని అనొచ్చా? అసెంబ్లీ ఆవరణలో పోలీసు వాహనాలు కూడా వచ్చి వెళ్లిపోతాయ్.. అంతేకాని అక్కడ ఉండనివ్వరు. అసెంబ్లీ చరిత్రలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. నన్ను సస్పెండ్ చేస్తే ఆవరణలో వచ్చి అరెస్ట్ చేయడం ఎందుకు? గాంధీ విగ్రహం, అమరవీరుల స్థూపం వద్ద నిరసనకు ఛాన్స్ ఇవ్వలేదు. అసెంబ్లీ మీడియా పాయింట్, పార్టీ ఆఫీస్ లో కూడా మీడియా తో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. ఇప్పటి ముఖ్యమంత్రిలాగా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. మేము ప్రతులు చింపి నిరసన తెలపలేదా? ఇప్పుడు లేచి నిలబడినందుకే సస్పెండ్ చేస్తారా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది కేసీఆర్ అని తీవ్ర విమర్శలు చేశారు ఈటల రాజేందర్.