కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఉద్యోగుల బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా మొండి వైఖరి అవలంభిస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఈ నర్సంపేట వాసి ఉప్పుల…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ బీసీ కమిషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. అందులో మాట్లాడుతూ… ఆత్మ గౌరవం వ్యాపారాలు పెంచుకోవడమేనా అని ఈటలను ప్రశ్నించారు. మీ వెంట ఎవరూ లేరు ఓడిపోతారని భయంతో రాజీనామా చేయడం లేదు. అధినేత కేసీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు మానుకోండి ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. తెరాస తరఫున గెలిచి స్థానిక సంస్థల ప్రతినిధులు తెరాసలో కొనసాగడం అమ్ముడుపోవడం ఎలా అవుతుంది. పార్టీలో ఉండి అధినేతపై పార్టీ పై…