పిల్లలైనా, పెద్దలైనా సన్‌గ్లాసెస్‌ను ఇష్టపడతారు. ఇవి ఎండతీవ్రత నుంచి కళ్లను రక్షిస్తూనే స్టైలిష్ లుక్‌ను జతచేస్తాయి.
వీటికి మరిన్ని ఫీచర్స్ జోడించి సరికొత్త కళ్లజోడు ( Qubo Go Audio Sunglasses )ను తీసుకొచ్చింది క్యుబో సంస్థ.
ఈ సన్‌గ్లాసెస్ బ్లూటూత్ స్పీకర్‌గానూ పని చేస్తాయి.
ఫోన్‌కి కనెక్ట్ చేస్తే కాల్స్ ఆన్సర్ చేయవచ్చు, పాటలు వినవచ్చు.
డ్రైవింగ్, రన్నింగ్, యోగా, షాపింగ్.. అన్ని సమయాల్లోనూ ఉపయోగించవచ్చు.
వీటిని ఒక్కసారి చార్జ్ చేస్తే ఆరుగంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి.
ఈ యూనిసెక్స్ గ్లాసెస్‌ను ఆడ, మగ.. ఎవరైనా ధరించవచ్చు.
ఆన్‌లైన్ ధర రూ.5,990. మరిన్ని ఫీచర్స్ తెలుసుకోవాలని అనుకుంటే.. quboworld.com చూడవచ్చు.