Tata Group: టాటా గ్రూప్‌లో కుమ్ములాట.. హైకోర్టు మెట్లు ఎక్కిన ట్రస్టులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Group: దేశంలోనే నంబర్ వన్ వ్యాపార గ్రూప్ అయిన టాటా సామ్రాజ్యంలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు రోడ్డున పడ్డాయి. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మళ్లీ కొనసాగించడంపై మొదలైన గొడవ ఏకంగా బాంబే హైకోర్టు దాకా వెళ్లింది. సొంత ట్రస్టులే కంపెనీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేసులు వేయడం, రూ.65 కోట్ల నష్టపరిహారం అడగడం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ వివాదంపై తాజాగా విచారణ జరిపిన బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 30న జరగాల్సిన బోర్డు మీటింగ్‌ను ఆపడానికి కోర్టు ఒప్పుకోలేదు. అయితే, ఆ మీటింగ్‌లో తీసుకునే నిర్ణయాలు హైకోర్టు ఇచ్చే తుది తీర్పుపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. నోయెల్ టాటా తరపు లాయర్ జనక్ ద్వారకాదాస్‌కు సమాధానం చెప్పేందుకు టైం ఇస్తూ, తదుపరి విచారణను 2027 జనవరి 21కి వాయిదా వేసింది.
అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే..
ఈ ఏడాది సెప్టెంబర్ 17న జరిగిన టాటా సన్స్ బోర్డు మీటింగ్‌లో ఎన్.చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు (2027 ఫిబ్రవరి నుంచి మూడోసారి) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. కానీ ఈ విషయంలో ట్రస్టుల తరపు డైరెక్టర్ల మధ్యే పెద్ద చీలిక వచ్చింది. చంద్రశేఖరన్‌ను మళ్లీ ఛైర్మన్‌గా పెట్టడాన్ని నోయెల్ టాటా గట్టిగా వ్యతిరేకించారు. మరో డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ మాత్రం చంద్రశేఖరన్‌కు సపోర్ట్‌గా నిలిచారు. ఇద్దరి మధ్య మాట కుదరకపోవడంతో, మీటింగ్‌కు అధ్యక్షత వహించిన హరీశ్ మన్వానీ తన ‘కాస్టింగ్ ఓటు’ (నిర్ణయాత్మక ఓటు) వాడి చంద్రశేఖరన్ నియామకాన్ని ఓకే చేశారు.
Also Read
- TRAI New Rules: జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ షాక్.. ఇక చౌక రీఛార్జ్ ప్లాన్లు మొదట కనిపించాల్సిందేనా..?
- Funeral Pre-Booking: ఇదేం వింత బిజినెస్ భయ్యా.. సొంత అంత్యక్రియలకు ముందే అడ్వాన్స్ బుకింగ్!
- December 2026 Updates: కొత్త నెల, కొత్త రూల్స్.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న పెద్ద మార్పులివే!
- IBM H-1B Visa: IBM కీలక నిర్ణయం.. H-1B వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ నిలిపివేత.. ఉద్యోగులకు 3 వారాల గడువు
హరీశ్ మన్వానీ కాస్టింగ్ ఓటు వాడటంపై సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, ఆర్డీ టాటా ట్రస్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాంబే హైకోర్టులో రెండు పిటిషన్లు వేశాయి. కంపెనీ రూల్స్ (ఆర్టికల్ 121) ప్రకారం ఇలాంటి పెద్ద నిర్ణయాలకు ట్రస్ట్ డైరెక్టర్ల మెజారిటీ మద్దతు ఉండాల్సిందేనని, కాస్టింగ్ ఓటుతో పనికాదని వాదించాయి. చంద్రశేఖరన్ నియామకాన్ని రద్దు చేయడంతో పాటు, దొరాబ్జీ టాటా ట్రస్ట్ రూ.50 కోట్లు, ఆర్డీ టాటా ట్రస్ట్ రూ.15 కోట్లు కలిపి మొత్తం రూ.65 కోట్ల నష్టపరిహారాన్ని 18 శాతం వడ్డీతో కట్టాలని డిమాండ్ చేశాయి. రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూప్‌లో ఇలాంటి విభేదాలు బయటపడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam Day 14 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం.. ఒకే వేదికపై విశేష కార్యక్రమాలు
-
Tata Group: టాటా గ్రూప్‌లో కుమ్ములాట.. హైకోర్టు మెట్లు ఎక్కిన ట్రస్టులు!
-
MLA Arul Vignesh Arrest: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్
-
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ హెయిర్ కేర్ సీక్రెట్ ఇదే!
-
Sharad Pawar: డీలిమిటేషన్‌పై ఎన్సీపీ సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి షాక్..!
-
Hyderabad Lands: కోట్ల విలువైన భూములు.. వేలానికి బిడ్డర్లు కరువు!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!