MLA Arul Vignesh Arrest: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Arul Vignesh Arrest: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని అధికార పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే)కి చెందిన కళ్లకురిచ్చి ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులు సహా ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నవంబర్ 23న ఫిర్యాదు.. ఐదు సెక్షన్ల కింద కేసు
కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ నవంబర్ 23న జిల్లా ఎస్పీ ఇ. షానాజ్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. తనకు ఎమ్మెల్యే అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నవంబర్ 24న కళ్లకురిచ్చి మహిళా పోలీస్ స్టేషన్లో అరుల్ విఘ్నేష్‌పై ఐదు చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను తిరుప్పూర్ ఎస్పీ సృష్టి సింగ్‌కు అప్పగించారు. ఆమె గత మూడు రోజులుగా పలువురు అధికారులను, సాక్షులను విచారించారు. కేసులో భాగంగా నవంబర్ 26న జిల్లా కలెక్టర్ న్యాయమూర్తి ఎదుట రహస్యంగా వాంగ్మూలం కూడా ఇచ్చారు. దర్యాప్తును ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 27) అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన గతంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, అవి రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read
- Sharad Pawar: డీలిమిటేషన్‌పై ఎన్సీపీ సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి షాక్..!
- TRAI New Rules: జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ షాక్.. ఇక చౌక రీఛార్జ్ ప్లాన్లు మొదట కనిపించాల్సిందేనా..?
- Modi Delimitation Formula: డీలిమిటేషన్ బిల్లులపై మారుతున్న సమీకరణాలు.. మోడీ మాస్టర్ ప్లాన్..! దక్షిణాది పార్టీల వైఖరిలో మార్పు!
- Lok Sabha Seats Increase: లోక్‌సభలో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో 42 నుంచి 63కు ఎంపీ సీట్లు.. రాష్ట్రాల వారీగా లెక్కలివే!
తాజావార్తలు
-
Koti Deepotsavam Day 14 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం.. ఒకే వేదికపై విశేష కార్యక్రమాలు
-
MLA Arul Vignesh Arrest: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్
-
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ హెయిర్ కేర్ సీక్రెట్ ఇదే!
-
Sharad Pawar: డీలిమిటేషన్‌పై ఎన్సీపీ సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి షాక్..!
-
Hyderabad Lands: కోట్ల విలువైన భూములు.. వేలానికి బిడ్డర్లు కరువు!
-
Gym Coach: జిమ్ కోచ్ ముసుగులో కీచకపర్వం.. కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!