Koti Deepotsavam Day 14 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం.. ఒకే వేదికపై విశేష కార్యక్రమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam Day 14 LIVE: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ యాజమాన్యం నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం దేదీప్యమానంగా వెలిగిపోతుంది.. ఇప్పటికే 13 రోజులు విజయవంతంగా సాగిన ఈ కోటి దీపయజ్ఞంలో ఇవాళ 14వ రోజులో భాగంగా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచేలా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం సందర్భంగా పలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. త్రిశక్తి స్వరూపిణి, విద్యాప్రదాయిని అయిన కొల్లూరు మూకాంబికాదేవికి మొట్టమొదటిసారిగా సౌభాగ్య అభిషేకం నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక పూజ భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.
అదేవిధంగా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి కోటిగాజుల అర్చన నిర్వహించనున్నారు. అమ్మవారి అనుగ్రహం కోసం చేపట్టనున్న ఈ విశేష అర్చనలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. మరోవైపు సంకష్టహర చతుర్థి శుభవేళ మహాగణపతికి ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించనున్నారు. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ స్వయంగా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని మహాగణపతికి క్షీరాభిషేకం చేయనున్నారు. శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవంతో పాటు మూకాంబికాదేవి సౌభాగ్య అభిషేకం, మహాలక్ష్మి కోటిగాజుల అర్చన, మహాగణపతి క్షీరాభిషేకం వంటి విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు. జగన్మాతతో పాటు శివకేశవుల అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఆ విశేష కార్యక్రమాలను లైవ్‌లో వీక్షించేందుకు ఈ కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Also Read
- Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
- Koti Deepotsavam 2026: 14వ రోజు విశేష కార్యక్రమాలు.. నేడు యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం!
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగులేదు!
- Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
తాజావార్తలు
-
Koti Deepotsavam Day 14 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం.. ఒకే వేదికపై విశేష కార్యక్రమాలు
-
Rohit Sharma : ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్‌కు గుడ్‌బై!
-
CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. డీలిమిటేషన్, అమరావతి, పెట్టుబడులపై ఏమన్నారంటే?
-
Nani: ‘నాని’ బ్రాండ్ ఉంటేనే చిన్న సినిమాలకు ఆదరణ?
-
Kidney Health Foods: కిడ్నీ ఆరోగ్యానికి వరం లాంటి ఆహారాలు ఇవే.. ప్రయోజనాలు ఎన్నో!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!