తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదివారం ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. అందరిని కలుపుకొని వెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానన్నారు. పార్టీలో ఎలాంటి సమస్యలు రాకుండా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కడియం ఆరూరి రమేష్‌కు సూచించారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని రమేష్‌కు కడియం సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించేలా పని చేస్తూ పార్టీ అభివృద్ధికి కట్టుబడాలని కడియం రమేష్‌కు చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తూ జిల్లా అభివృద్ధికి పాటుపడాలని కడియం కోరారు.
Read Also: రాష్ట్రంలో ఐఏఎస్,ఐపీఎస్ వ్యవస్థలను కేసీఆర్ ధ్వంసం చేశారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి