Minister Seethakka: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. కొమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం కొమురం భీం జిల్లా, మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఉమ్మడి జిల్లా అధికారుల తో ఉట్నూర్ లో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 7:15 గంటలకు నూతన జిల్లా గ్రంధాలయ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఉదయం 07:30 గంటలకు సీతక్క ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఉదయం 08.00 గంటలకు ఆసిఫాబాద్ మండలంలోని గుండిగ్రామం వద్ద వంతెన పరిశీలించనున్నారు. ఉదయం 10:00 AM కి జోడేఘాట్ లోని కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. మ్యూజియం సందర్శించిన అనంతరం మధ్యాహ్నం భోజనం అనంతరం ఉట్నూర్ కే.బీ కాంప్లెక్స్ లో నాలుగు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Read also: Israel Hamas War: శ్మశానవాటికగా మారిన గాజా.. 9000 మంది మహిళలు మృతి
మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాటు పలువురు మహిళ అధికారిణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో మహిళల్లో చాలా మంది రక్త హీనతతో బాధపడుతున్నారని… పౌష్టికాహారం లోపం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి అంగన్వాడీలలో పిల్లలకు నర్సరీ క్లాస్లను కూడా ప్రారంభిస్తామన్నారు.
Read also: Population Counting: వాటి తర్వాతే జనగణన..!
నగరంలో వలస కూలీలు ఉండే ప్రాంతాల్లో అంగన్వాడీ మొబైల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి, వారి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినిలకు సానిటరీ న్యాప్కిన్ కిట్స్లను అందిస్తామని తెలిపారు. 90 రోజుల్లో తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుందని… రాబోయే రోజుల్లో మరిన్ని పధకాలను అమలు చేసి, ప్రజలకు చేరువవుతామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదివాసీ బిడ్డగా విప్లవ ఉద్యమంలోకి వెళ్లి గన్ను పట్టానని.. ఉద్యమం నుండి బయటకు వచ్చాక ప్రజాసేవ చేసేందుకు తనకు ఈ అవకాశం దక్కడం గర్వంగా ఉందన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించిన మంత్రి… వారికి లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకంతో సత్కరించారు. ఈ సందర్భంగా డప్పు కళాకారిణి వేసిన దరువుకు దివ్యంగురాలు అయిన భాగ్య అనే విద్యార్థితో కలిసి మంత్రి డ్యాన్స్ చేశారు.
Congress: నేటితో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు