Minister Seethakka : మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది.!
- బీఆర్ఎస్ పాలనపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు
- అప్పుల భారం వల్లే ఖజానాపై ఒత్తిడి
- రైతు రుణమాఫీ, ఉద్యోగాలపై కౌంటర్
- కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్‌కు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విమర్శలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వ ఖజానా సరిపోతోందని ఆమె ధ్వజమెత్తారు. “పాండవులు సంపాదించింది కౌరవుల తద్దినానికే సరిపోయినట్లు.. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే మాకు సరిపోతోంది” అంటూ ఆమె ఎద్దేవా చేశారు. హరీష్ రావు తన నియోజకవర్గంలోనే రైతులకు అప్పులు ఉన్నాయని చెబుతున్నారని, మరి ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉండి కూడా పదేళ్లలో ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారని సీతక్క ప్రశ్నించారు.
Fake IAS Officer: నిత్య పెళ్లికొడుకు బాగోతం.. నకిలీ ఐఏఎస్‌గా 25 సార్లు పెళ్లిళ్లు.. ఎలా చిక్కాడంటే!
Also Read
- Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం రైతులను వంచించిందని, ఇప్పుడు ఆరు నెలల తమ పాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమమే నిధులు, నియామకాల కోసం జరిగిందని గుర్తు చేసిన సీతక్క, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ గ్యారెంటీ ఇచ్చిందని నిలదీశారు. కేవలం నోటిఫికేషన్లు ఇస్తే సరిపోదని, తాము అధికారంలోకి రాగానే వేల సంఖ్యలో నియామక పత్రాలు అందజేసి పేద కుటుంబాల్లో వెలుగులు నింపామని స్పష్టం చేశారు.
Tollywood Events: అంత జరిగినా అదే నిర్లక్ష్యమా ?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు , నూతనంగా ప్రకటించిన ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకాలను చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని సీతక్క విమర్శించారు. “మీరు పదేళ్లలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో లెక్క చెప్పండి.. మేము ఈ రెండేళ్లలో ఎన్ని ఇస్తామో చూపిస్తాం” అని ఆమె సవాలు విసిరారు. హరీష్ రావు పడుతున్న బాధ అంతా అధికారం పోయిందనే తప్ప, ప్రజల మీద ప్రేమతో కాదని సీతక్క వ్యాఖ్యానించారు. సీటు మారగానే చరిత్ర మారిపోదని, పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేయని పనుల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ప్రజల కోసం తాము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆమె సూచించారు.
తాజావార్తలు
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..