Warangal: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయంత తెలిసిందే. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామసభలు ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఇప్పటికే.. అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. తాజాగా ఈ ప్రజాపాలన ఎలా కొనసాగుతుంతో తెలుసుకునేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ.. ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Also Read: Sunburn Event Cancel: హైదరాబాద్‌లో సన్‌బర్న్ ఈవెంట్ రద్దు.. నిర్వాహకుడు సుశాంత్‌పై కేసు
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘28 నుండి 7వ తేదీ వరకు గ్రామ సభలు పెట్టబోతున్నాము. ప్రజల నుండి అర్జీలను తీసుకుంటాం. గత ప్రభుత్వంలో మంత్రులు వారి వారి శాఖలపైనా కనీసం సమీక్ష సమావేశాలు పెట్టుకునే అవకాశం లేదు. ఆ కుటుంబం నుండి ఆదేశాలు ఉంటేనే మంత్రులు సమావేశం పెట్టుకున్న దుస్థితి ఉంది. ఆ తీరు ఇప్పుడు లేదు. 28 నుండి 6 వరకు గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకుంటాం. కొత్త ప్రభుత్వం వచ్చినా తరువాత అధికారులు స్వచ్ఛగా పనులు చేసుకుంటున్నారు. రెక్కలు వచ్చినా కొత్త పక్షులు ఎలా స్వచ్ఛగా ఎగురుతాయో అధికారులు స్వచ్ఛగా వారి ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చిత్త శుద్ధితోనే ఉంది. ఇచ్చిన హామీలను అధిస్తాం.
ప్రజా పాలన అందించేందుకు గత ప్రభుత్వం లాగా రెండు రోజుల పాటు దరఖాస్తులు తీసుకొని తర్వాత సమయం అయిపోయింది అనే తీరు ఈ ప్రభుత్వంది కాదు.
ఈ ప్రభుత్వం అధికారులే వచ్చి మీ దరఖాస్తులు తీసుకుంటారు. ఈ వారం రోజులే కాదు.. మిగిలిన రోజుల్లో కూడా మీ దరఖాస్తులు తీసుకుంటారు. మొన్న అసెంబ్లీలో అంత సమయం ఇస్తే ఏమి చెప్పే లేదు. మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంట్ చేశారు అందులో ఆస్తులు సంపాదించామని చెబుతున్నారు. ఒకటి కూలిపోయిన మేడిగడ్డ.. మంచిగా ఉన్న రాజ్‌భవన్ లాంటి సెక్రటేరేట్‌ను కట్టారు. వరంగల్‌లో మంచి కలెక్టరేట్ ఉండేది.. అది కూల్చి ఇది కట్టారు. కానీ పేదలకు ఉండేందుకు గూడు ఇవ్వలేదు. కావాల్సినంత సమయం ఇచ్చిన అసెంబ్లీలో చెప్పుకోవచ్చు కదా అయిన ఇంటి దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇచ్చారు’ అని మంత్రి వ్యాఖ్యానించారు.