MInister Niranjan Reddy: షర్మిలపై కౌంటర్ ఎటాక్.. రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీచేసి సత్తా చూపించు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు మంత్రి నిరంజన్ రెడ్డి.. వనపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన… మీ రెండువందలు ఎక్కడ ?.. మా రెండు వేలు ఎక్కడ ?.. 10 లక్షల మందికి కొత్త ఫించన్లు ఇచ్చిన ఘనత మా సర్కార్‌ది అన్నారు.. ఊర్లో ఎవరయినా చస్తే తప్ప ఫించన్ రాని పాలన నుండి బతికున్న మనుషులకు ఫించన్లు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్న ఆయన… పాలన రాదన్న స్థితి నుండి దేశ పాలనకు దిక్సూచిలా నిలిచాం అన్నారు. ఇక, తెలంగాణలో కొందరు అహంకారంతో యాత్రలు చేస్తున్నారు.. అడ్డగోలుగా దోచుకున్న అక్రమ సొమ్ముతో కిరాయికి పూలు చల్లించుకుంటూ.. కిరాయి మనుషులతో.. కిరాయి యాత్రలు చేస్తున్నారు అంటూ వైఎస్ షర్మిలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు..
Read Also: Hyderabad Metro Rail New Record: గణేష్ నిమజ్జనం వేళ.. మెట్రో నయా రికార్డు..
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
కేసీఆర్ నాయకత్వంలో 80 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లిచ్చి 50 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నామని తెలిపారు మంత్రి నిరంజన్‌రెడ్డి.. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక దేశంలోని కొన్ని శక్తులు తెలంగాణ మీదకు కొందరిని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. 22 ఏండ్లుగా తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల మధ్యన ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన ఉద్యమకారున్ని.. రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది అంటూ ఫైర్ అయ్యారు.. వైఎస్ ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా ఆదాయపు పన్ను కట్టిన వ్యక్తిని నేనన్న ఆయన.. వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు తెచ్చి ఎకరా ఎకరాకు నీళ్లు పారించిన వ్యక్తిని అన్నారు. ఇక, రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటీచేసి నీ సత్తా ఏంటో చూయించు అంటూ సవాల్ విసిరారు.
తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే నా బిడ్డలను విదేశాల్లో చదివించాను అన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి.. తెలంగాణ గడ్డ మీద అహంకారంతో యాత్ర చేస్తూ తెలంగాణ వారిని దూషిస్తున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వనపర్తి పరిధిలో ఉన్న పొలికెపాడు గ్రామవాసి అచ్చంపేట దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజును అవహేళన చేశారు.. గువ్వల బాలరాజు అచ్చంపేట ఎమ్మెల్యే ఆయన అక్కడ అభివృద్ధి చేస్తాడు .. నేను ఇక్కడ అభివృద్ధి చేస్తాను.. పొలికెపాడు గ్రామానికి సాగునీరు తెస్తే ఒకే ఒక్క యాసంగిలో 20 కోట్ల రూపాయల పంట పండించారని వెల్లడించారు.. అక్రమాస్తుల అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే.. ఒక్కమాటకు వందమాటలు అంటాం.. అహంకారంతో మాట్లాడితే ఆత్మవిశ్వాసంతో చీల్చి చెండాడుతాం అని హెచ్చరించారు. కాగా, గతంలో తనపై నిరంజన్‌రెడ్డి చేసిన విమర్శలపై స్పందిస్తూ.. గట్టిగా కౌంటరిచ్చారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. తనను మంగళవారం మరదలన్నాడని.. ఎవడ్రా నువ్వు, నీకు సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు నిరంజన్ రెడ్డి అంటూ ఫైరయ్యారు. ఈయనకు కుక్కకు ఏమైనా తేడా వుందా? అంటూ ప్రశ్నించిన ఆమె.. అధికార మదం తలకెక్కిందా… నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!