కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. దక్షిణాదిలో మళ్లీ అధికారంలోకి రావాలన్న బీజేపీ ఆశలు, కింగ్‌మేకర్‌గా ఆడాలన్న జేడీ(ఎస్) ఆశలు సన్నగిల్లుతున్నాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని సమాచారం. కాంగ్రెస్ శిబిరం నుంచి వచ్చిన సమాచారం మేరకు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలో బీజేపీ కంటే రెట్టింపు సీట్లు సాధించిన కాంగ్రెస్ ముందు ముందు నేతల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యం. అయితే.. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : SRH vs LSG: ఆదిలోనే సన్‌రైజర్స్‌కు హంసపాదు.. తొలి వికెట్ డౌన్
నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. పెట్టుబడులు , మౌలిక సదుపాయాలను సృష్టించడం కోసం హైదరాబాద్ … బెంగళూరు ఆరోగ్యంగా పోటీ పడనివ్వండని, కర్ణాటకలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు అని వెల్లడించారు మంత్రి కేటీఆర్. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నుంచి గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు కూడా సిద్ధరామయ్యకు మద్దతిస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఎంతగానో సహకరించిన వొకలింగ సామాజికవర్గాన్ని కూడా కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోనుంది. ఈ సామాజికవర్గం నుంచి ఒకరిని ఉప ముఖ్యమంత్రి కూడా చేస్తారు. డీకే శివకుమార్‌కు ముఖ్యమైన శాఖలు ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read : Rahul Gandhi: ప్రేమతో గెలిచాం.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది..