Nikhat Zareen Won Gold Medal In National Women Boxing: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి మెరిసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కనబరిచి, టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో రైల్వేస్‌కు చెందిన తన ప్రత్యర్థి అనామికపై 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. అంతకుముందు సెమీ ఫైనల్స్‌లోనూ శివిందర్ కౌర్‌ను 5-0 తేడాతో చిత్తుగా ఓడించిన నిఖత్.. ఫైనల్స్‌లో ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రప్ఫాడించేసింది. దీంతో.. అనామిక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆమె ఒక బౌట్‌ను గెలిచినా, చివరికి నిఖత్ చేతిలో ఓటమి తప్పలేదు. మొత్తం ఐదు రౌండ్లు జరగ్గా.. కేవలం చివరి రౌండ్‌లో మాత్రమే నిఖత్ కంటే అనామిక ఎక్కువ పాయింట్లు దక్కించుకోగలిగింది. మిగిలిన రౌండ్లలో నిఖద్‌దే పైచేయి. ఫలితంగా.. 4-1 తేడాతో నిఖత్ విజయం సాధించి, జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది.
Tunisha Sharma Death: మాజీ ప్రియుడు సంచలన వాంగ్మూలం .. సీన్‌లోకి శ్రద్ధా వాకర్ కేసు
ఈ ఏడాది ఆరంభంలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లో పసిడి గెలిచిన నిఖత్.. ఆ తర్వాత ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే! కామన్వెల్త్ గేమ్స్ 2022లోనూ సత్తా చాటుకొని, టైటిల్ నెగ్గింది. ఇప్పుడు జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచినందుకు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమెను అభినందించారు. అభిమానులు సైతం ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రతీ టోర్నీలోనూ సత్తా చాటుతూ.. రాష్ట్ర ప్రతిష్టను దిశదిశలా చాటుతోందని కొనియాడుతున్నారు.
E-Luna: ఇక, ఎలక్ట్రిక్ ‘లూనా’.. నెలకు 5,000 సెట్లు మార్కెట్‌లోకి..!