Minister KTR Met With Some Famous Industrialists In Mumbai About Investments: తెలంగాణ ఐటీ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) ఈరోజు ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో కలిశారు. తొలుత.. టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాలపైన చర్చించిన కేటీఆర్.. తెలంగాణలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానాలపై మాట్లాడారు. రాష్ట్రంలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను వివరించిన ఆయన.. వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని అన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో భాగంగా.. హైదరాబాద్‌లో ఒక ఎమ్మార్వో (Maintenance, Repair and Overhaul) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అడిగారు. కేటీఆర్ మాటలన్ని ఎంతో ఏకాగ్రతతో విన్న చంద్రశేఖర్.. భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో కచ్చితంగా తెలంగాణకు కీలకమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Yuvashakti : పిరికితనం అంటే నాకు చిరాకు.. ప్రాణ త్యాగం చేస్తా…
అనంతరం జేఎస్‌డబ్ల్యు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌తో భేటీ అయిన కేటీఆర్.. స్టీల్, సిమెంట్ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు.. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని, అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సేయిల్ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. JSW వంటి ప్రతిష్టాత్మక సంస్థ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొస్తే.. అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. విద్య, క్రీడా రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఆ తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో సమావేశమైన కేటీఆర్.. తెలంగాణ ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. తలసరి ఆదాయంతో పాటు ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పామ్ ఆయిల్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక బృహత్తర లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహిస్తోందన్నారు. వంట నూనెల ఉత్పత్తి కోసం హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని వివరించారు. ఇక చివరగా ఆర్‌పీజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయంకా భేటీ అయిన కేటీఆర్.. పెట్టుబడులతో పాటు రాష్ట్ర ప్రగతిపై చర్చలు జరిపారు.
SpiceJet Flight: ఢిల్లీ-పూణే స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు