Yuvashakti : పిరికితనం అంటే నాకు చిరాకు.. యువత కోసం, రాష్ట్రం కోసం అవసరం అయితే ప్రాణ త్యాగానికి సిద్ధమని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ.. నా ఆఖరి శ్వాస వరకు రాజకీయాలను వదలను.. రణస్థలం నుంచి హామీ ఇస్తున్నాను అన్నారు.. నాకడ శ్వాస వరకూ రాజకీయాలను వదలను, మిమ్మల్ని కూడా వదలబోనన్న ఆయన.. అసలు పూర్తిస్థాయి నాయకులంటే ఎవరు..? అని ప్రశ్నించారు.. నేను సినిమాలు చేయాలి.. నాకు వేరేదారి లేదన్న ఆయన.. డబ్బు నాకు అవసరం లేని రోజు వస్తే సినిమాలను వదిలేస్తానన్నారు. మన భవిష్యత్ కాలరాస్తున్న వ్యక్తులు ఎవరు..? అని ప్రశ్నించిన ఆయన.. రైతులకు గిట్టుబాటు ధరలేదు.. నిరుద్యోగులకు ఉద్యోగం లేదు.. ఉద్యోగులకు జీతం రావడంలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: Swiggy’s Losses: మగ్గిపోతున్న స్విగ్గీ
సంబరాల రాంబాబు పిచ్చి కూతలు ఆపేసి పనిచేయాలి అంటూ అంబటి రాంబాబుపై సెటైర్లు వేశారు పవన్ కల్యాణ్.. వైసీపీ గూండాలకు చెబుతున్నా నేను బతికున్నంత వరకు పోరాడుతాను అన్నారు.. సంస్కార వంతంగా ఉంటే.. నా అంత సంస్కార వంతుడు ఎవరూ ఉండరు..? కానీ, రెచ్చగొడితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం అన్నారు.. ఇక, నేను కులనాయకుడిని కాదు.. ఒక్క కులం కోసం కాదు, ఏపీ, తెలంగాణ అందరూ బావుండాలని కోరుకున్న వ్యక్తిని అన్నారు.. వైసీపీ ఒక్క కులంతోనే నింపేసుకుంటున్నారని విమర్శించారు.. పొద్దున్నే పథకం క్రింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారాతో పట్టుకు పోతున్నారని ఆరోపించారు.. మరోవైపు.. మంచి వ్యక్తిత్వం ఉన్న వారికి గౌరవిస్తాను, జైలులో ఉన్నవారిని కాదన్న పవన్.. నేను ఒకతరాన్ని మేలు కోలుపుతున్నాను.. మేం అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తా.. వలసలు ఆపుతానని ప్రకటించారు. మత్స్యకారులకు జెట్టీలు నిర్మిస్తాను.. అవసరం అయితే ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధం అన్నారు.. మీ కోసం ప్రాణత్యాగం చేస్తా నని ప్రకటించారు పవన్ కల్యాణ్..