Minister KTR: రాజ్‌నాథ్ కు నాలుగు రిక్వెస్ట్‌లు ఇచ్చాం.. స్పందించి సాయం అందిస్తే సంతోషం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: కేంద్ర రక్షణ రాజ్‌నాథ్ కు నాలుగు రిక్వెస్ట్‌లు ఇచ్చామని, కేంద్ర ప్రభుత్వం స్పందించి సహాయం అందిస్తే సంతోషిస్తామాని మంత్రి కేటీఆర్ అన్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ ఇవాళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, కేంద్రం సహాయ సహకారాలు అందించాలని పలు సందర్భాల్లో విన్నవించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు అందిన సాయం శూన్యమని విమర్శించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. వ్యాక్సిన్ తయారీకి తెలంగాణ గ్లోబల్ హబ్‌గా మారిందని అన్నారు. హైదరాబాద్ వరదలకు కేంద్రం సాయం చేయలేదన్నారు. హైదరాబాద్‌లో రక్షణ శాఖ భూములు ఉన్నచోట అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. ఈ విషయమై ఇప్పటివరకు ఎన్డీయే ప్రభుత్వంలో పనిచేసిన ఐదుగురు రక్షణ మంత్రులను పలుమార్లు కలిశామన్నారు. ఈరోజు మరోసారి రాజ్‌సింగ్‌ను కలిశామని తమ డిమాండ్లను వినిపించామని చెప్పారు. ప్రధానంగా నాలుగు వినతులు ఇచ్చినట్లు తెలిపారు.
Read also: ఈ పండు తింటే.. తండ్రి అవ్వాలనే కల నెరవేరుతుంది
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
‘‘హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారి (ఉత్తర తెలంగాణ వైపు) వెళ్లే దారిలో స్కై వెలా నిర్మాణానికి 96 ఎకరాల రక్షణ శాఖ భూమిని కోరాం. దానికి సమానంగా భూమి ఇస్తామని చెప్పారు. అలాగే.. మా వద్ద పట్టి నుంచి నాగ్‌పూర్ హైవే వరకు 18.5 కి.మీ మే స్కైవే నిర్మించేందుకు 56 ఎకరాల స్థలం అడిగారు.భూమి ఇస్తామని చెప్పారు.ఉప్పల్‌లో స్కై వాక్ నిర్మించాం…సోమవారం ప్రారంభిస్తాం.మనం కోరుకుంటున్నాం. మొహిదీపట్నం రైతుబజార్ వద్ద కూడా అలాంటి స్కై వాక్ నిర్మించాలని.. రక్షణ శాఖ స్థలం కూడా ఉందని.. అందులో అర ఎకరం కావాలని కోరారు. హైదరాబాద్ నగరంలో 142 లింక్ రోడ్లు ప్లాన్ చేశాం.. రెండు, మూడు కారిడార్లలో రక్షణ శాఖకు చెందిన భూములు అడ్డు వస్తున్నాయని.. వాటిని కూడా ఇవ్వాలని కోరారు. అలాగే కంటోన్మెంట్ ఏరియాలోని లీజు భూములను జీహెచ్ ఎంసీకి బదలాయిస్తే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టేందుకు దోహదపడుతుందన్నారు.
సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం’’ అని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి సహాయం అందిస్తే సంతోషిస్తామన్నారు. లేకుంటే ప్రజా క్షేత్రంలో తమ తీరును ఎండగడతామన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా ఇచ్చామన్నారు. రేపు వాటిని పరిశీలించాల్సిందిగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కోరనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని 10 మెట్రోలకు సాయం అందించిన కేంద్రం తెలంగాణలో హైదరాబాద్‌కు సాయం అందించడం లేదని విమర్శించారు. గుజరాత్‌లో వరదలు వస్తే ఆదుకుంటామని, హైదరాబాద్‌కు ఇంతవరకు సాయం చేయలేదని విమర్శించారు. తెలంగాణ రూపాయిని వెనక్కి తీసుకుంటే కేవలం 46 పైసలు మాత్రమే వెనక్కి వస్తుందన్నారు. దేశంలోని వెనుకబడిన ప్రాంతాలకు వెళ్లినందుకు తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేయాలన్నారు.
Ashada Masam 2023: ఆషాడ మాసం.. కొత్త జంటలు, అత్తాకోడళ్లు అస్సలు కలవకూడదు ఎందుకు?
తాజావార్తలు
-
University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!