University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు లండన్ యూనివర్సిటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ మేరకు లండన్ యూనివర్సిటీ సెనేట్ హౌస్‌లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లండన్ యూనివర్సిటీలోని సెనేట్ హౌస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి సీఎం తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ అధికారులు కే. రామకృష్ణారావు, జయేశ్ రంజన్లు పాల్గొన్నారు. లండన్ యూనివర్సిటీ ప్రతినిధులతో వారు సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
ఈ భేటీలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్ఎస్ఈ), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (ఎస్ఓఏఎస్)కు చెందిన ప్రతినిధి బృందాలు, ఇతర ప్రతినిధులు కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు లండన్ యూనివర్సిటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు. యూనివర్సిటీకి చెందిన వివిధ స్కూళ్లు, విభాగాల ద్వారా విస్తృత స్థాయిలో విద్యా కోర్సులు, వివిధ విద్యా కార్యక్రమాలను అందించేలా ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వివరించారు. లండన్ యూనివర్సిటీకి చెందిన వివిధ విద్యా విభాగాలను ఒకే అకడమిక్ ఫెడరేషన్‌గా అనుసంధానించే విధంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!