Ashada Masam 2023: హిందూ పంచాంగం ప్రకారం తెలుగు మాసాలలో ఆషాడ మాసం చాలా ముఖ్యమైనది. కొత్తగా పెళ్లయిన వధువులు ఆషాడ మాసంలో తప్పకుండా పుట్టింటికి వెళ్తారు. అంతేకాదు భార్యాభర్తలు కలవకుండా జాగ్రత్త పడుతుంటారు. అదేవిధంగా ఈ మాసంలో అత్తకోడళ్లు కూడా కలవకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతుంటారు. అయితే ఆషాఢ మాసానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. దేవతలను ఆరాధించడానికి ఈ మాసం చాలా శ్రేష్ఠమైనది. అందుకే ఆషాఢమాసంలో ప్రత్యేక పూజలతో కోట్లాది మంది భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతాయి. పూజారులు కూడా పూజ కార్యక్రమాల్లో బిజీ కానున్నారు. ఆషాఢమాసం పెళ్లికి సమయం కాదు.. ఆషాఢమాసంలో వివాహాలు కూడా జరగవు.
Read also: Ram Charan: గేమ్ చేంజర్ టీజర్ విడుదలకి రంగం సిద్ధం…
ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రపోతాడని, ఈ సమయంలో వివాహం చేసుకున్న వారికి విష్ణువు అనుగ్రహం లభించదని పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢమాసంలో కొత్త జంటలు, అత్తాకోడళ్లు ముఖం చూడకూడదని పురాణాలు చెబుతున్నాయి. పూర్వ కాలంలో, కొత్తగా పెళ్లయిన జంటలు దాదాపు ఆరు నెలల పాటు పుట్టింటికి వెళ్లేవారని, కానీ ఇప్పుడు టెక్నాజీ పెరిగిందని కొందరు వాటి పట్టించుకోవడం మానేసారు. దీని వల్ల అనర్థాలు జరగుతాయని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా.. ఆషాఢ మాసంలో వర్షాలు విస్తారంగా కురుపడే అవకాశం ఉంది. ఇది వ్యవసాయ దేశం. ఈ సమయంలో వ్యవసాయ పనులన్నీ ప్రారంభించేందుకు అందరూ సన్నిద్ధం అవుతుంటారు. ఈ కాలంలో అన్నదాతలు కష్టపడితేనే మనకు ఆహారం లభిస్తుంది.
అయితే ఈ కాలంలో కొత్త పెళ్లికొడుకు తన భాగస్వామిపై మోజు పెంచుకుని వ్యవసాయ పనులకు దూరంగా ఉండే అవకాశం ఉందని పెద్దలు చెబుతుంటారు. అందుకే నవ వధువును ఈ మాసంలో తప్పకుండా పుట్టింటికి పంపిస్తారని శాస్త్రాలు చెబుతాయి. పురాణాల ప్రకారం ఆషాఢమాసంలో గర్భం ధరించడం మంచిది కాదు. దీని వల్ల ఆషాఢమాసంలో వధువు పుట్టింటికి వెళ్లాలనే ఈ ఆచారాన్ని పండితులు తీసుకువచ్చారని చెబుతారు. అంతేకాకుండా వేసవి కాలంలో నవ వధువు అసౌకర్యానికి గురికావడమేకాకుండా.. అత్తమామల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుందని ఈ ఆషాఢమాసంలో నవ వధువును పుట్టింటికి పంపించే ఆచారాన్ని వేద పండితులు తీసుకువచ్చారు. హిందూ పంచాంగం ప్రకారం కొత్త జంట, అత్తా కోడళ్లు వీటిని ఆచరిస్తే మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ రియల్ “దేవదాస్”.. బీజేపీ వ్యంగ్యాస్త్రాలు..