ధాన్యం కోనుగోళ్ల విషయమై బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయి చేరింది. ఇటీవల తెలంగాణ మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ నేడు మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర బీజేపీతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ మానసిక పరిస్థితిపై మాకు అనుమానాలు ఉన్నాయన్నారు.
ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా భారత ప్రభుత్వం ప్రతి గింజ కొంటుందని చెప్పారని, కానీ కేంద్రం మాత్రం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఢిల్లీ బీజేపీ కరెక్టా …సిల్లీ బీజేపీ కరెక్టా చెప్పాలి అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించాఉ. లోకల్ బీజేపీ నాయకులకు తల తోక లేదని, ధాన్యం కొనుగోలు పై కేంద్రం స్పష్టత ఇవ్వాలన్నారు. కేసీఆర్ గత ఏడాది నవంబర్ 18 ఇందిరా పార్కు లో ధర్నా చేశారని, యాసంగిలో రైతులను వరి వేయాలని బీజేపీ నేతలు రెచ్చగొట్టారన్నారు.