Minister KTR: నడ్డా.. కేసీఆర్ ను ఎందుకు జైలుకు పంపుతావ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: నడ్డా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు.. కేసీఆర్ ను ఎందుకు జైలుకు పంపుతావ్ ? అంటూ మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. హైదరాబాద్ లో మొట్టమొదటి స్కై వాక్ బ్రిడ్జి ఉప్పల్ లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 4,5 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు త్వరలో ఇస్తామని అన్నారు. నారపల్లి-ఉప్పల్ బ్రిడ్జి నిర్మాణం కేంద్రం ఆలస్యం చేస్తోందని తెలిపారు. 35 ఫ్లై ఓవర్లు, అండర్ వేలు తొమ్మిదేళ్ళలో నిర్మాణం పూర్తి చేసామన్నారు. ఉప్పల్, అంబర్ పేట ఫ్లై ఓవర్లు బీజేపీ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. మోడీ – కేసీఆర్ పాలనకు ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణాలే నిదర్శనమని మంత్రి అన్నారు. నాలుగేళ్ళ నుంచి ప్రజలను కేంద్ర ప్రభుత్వం చావగొడుతుందని అన్నారు. ఉప్పల్ లోని ఐదు పారిశ్రామికవాడలు ఉండేవి. వాటికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. నాడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని మంత్రి అన్నారు. 10 డివిజన్లలో మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మించాలని అన్నారు. ప్రజల గురించి ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నడ్డా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు.. కేసీఆర్ ను ఎందుకు జైలుకు పంపుతావ్? అంటూ ప్రశ్నించారు.
Read also: Malla Reddy: ఖబడ్దార్.. కేసీఆర్ ను ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు
Also Read
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
- Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
- Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
రూ. 13 లక్షల మంది ఆడ పిల్లలు కేసీఆర్ కిట్ ఇస్తున్నందుకు అరెస్ట్ చేస్తావా? అని మండిపడ్డారు. కేసీఆర్ ను తిట్టి పైచాకిక ఆనందాన్ని పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వయస్సు 70 ఏళ్ళు. ఆయన ప్రజల ఆశీస్సులతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని మంత్రి గుర్తు చేశారు. నడ్డా కానీ, తీన్ ఫుట్ గాళ్ళు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 55 ఏళ్లలో చేయలేని పని బిఆర్ఎస్ తొమ్మిదేళ్లలో చేసామన్నారు. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. కేసీఆర్ – బీజేపీ, కేసీఆర్ – కాంగ్రెస్ తో కలిసిపోయారని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధి గురించి మాట్లాడాలని అన్నారు. 55 ఏళ్లలో కాంగ్రెస్ దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు ఏమి చేసింది? అని ప్రశ్నించారు. అమరవీరులను చంపింది ఎవరు? సోనియాగాంధీ వల్లే కదా పొరగాళ్ళు చనిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంపినోడే సంతాప సభ పెట్టినట్లు రేవంత్ మాటలు ఉన్నాయని అన్నారు. అవినీతి గురించి రేవంత్ చెప్పడం హాస్యాస్పదం తెలిపారు. 50 లక్షలతో దొరికిన దొంగ రేవంత్ అని ఆరోపించారు. ఢిల్లీ గులాములతో ఏమి కాదని మంత్రి కేటీఆర్ అన్నారు.
Vemula Prashanth Reddy: నడ్డా ఇది కేసిఆర్ అడ్డా.. నోరు అదుపులో పెట్టుకో బిడ్డా
- Tags
- bjp
- BRS
- cm kcr
- jp nadda
- Minister KTR
తాజావార్తలు
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
-
Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
-
Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
-
Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!