Malla Reddy: ఖబడ్దార్ కాంగ్రెస్, బీజేపీ నేతల్లారా… కేసీఆర్ ను ఒక్క మాట అంటే ఊరుకునేది లేదని మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ టవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లార్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. మురికి కంప, డంపింగ్ యార్డ్ లా ఉన్న ఉప్పల్ రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంమే అని గుర్తుచేశారు. నలుగురు ముఖ్యమంత్రులు మారిన ఉప్పల్ సమస్యలు మారలేదని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప్పల్ సమస్యలు తీర్చారని అన్నారు. ఒకప్పుడు తాగునీరు లేకుంటే… ఇప్పుడు గోదావరి ఫిల్టర్ వాటర్ ఇస్తున్నారని గుర్తుచేశారు.
ఉప్పల్ నుంచి నారపల్లి బ్రిడ్జి నిర్మాణం ఆరేళ్ళ నుంచి అలానే ఉందని అన్నారు. స్థానిక ఎంపీ ప్రశ్నిస్తానని చెప్పి పార్లమెంటులో ఒక్కసారి నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించలేదని మండిపడ్డారు. ఢిల్లీకి పోయిన వాళ్లంతా బీఆర్ఎస్ రిజెక్ట్ చేసిన వాళ్లే అని అన్నారు. ప్రజలు వాళ్ళను తిరస్కరించారని అన్నారు. తాగునీరు, కళ్యాణ లక్ష్మీ ఇచ్చినందుకు కేసీఆర్ ను అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు. ఖబడ్దార్ కాంగ్రెస్, బీజేపీ నేతల్లారా… కేసీఆర్ ను ఒక్క మాట అంటే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా కేసీఆర్ నాయకత్వంను కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని అన్నారు. కేసీఆర్ మహాత్ముడు.. గొప్ప సీఎం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రూ.36.50 కోట్లతో హెచ్ ఎండీఏ నిర్మించింది. ఈ స్కైవాక్ 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల నిలువు వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తుతో బస్ స్టాప్‌లు మరియు మెట్రో స్టేషన్‌లను కలుపుతూ నిర్మించబడింది. 8 చోట్ల లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు, 6 మెట్లు ఏర్పాటు చేశారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్‌ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్‌ఎంసీ కార్యాలయం సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ముందు ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉప్పల్ భగాయత్ లోని శిల్పారామంలో స్కైవాక్ టవర్ తో పాటు నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లార్‌రెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్‌మోహన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Kerala Story: కేరళ స్టోరీ టీమ్ అనౌన్స్ చేసిన కొత్త సినిమా ‘బస్తర్’