హుజురాబాద్ పట్టణంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… పట్టణంలో ఎకరం భూమిలో కోటి రూపాయలతో జయశంకర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం శుభ దినం. ఏడాది లోగా భవనం అందిస్తాం. ప్రభుత్వపరంగా ఏనాడైనా మాజీ మంత్రి సంఘ భవనం ఇచ్చిందా.. కళ్యాణ లక్ష్మీ దండగ అణా మాజీ మంత్రికి ఓటు వేద్దామా… కాంగ్రెస్ కనుమరుగైంది… హుజురాబాద్ లో బొట్టుబిళ్లకు,లక్ష రూపాయల కల్యాణ లాక్షికి పోటీ జరుగుతుంది. బిసిల జనగణన జరగాలి అన్న కేంద్రంలో ఉన్న బీజేపీ కి పట్టడం లేదు. గ్యాస్,పెట్రోల్,డిసిల్ ధర పెంచిన బీజేపీకి కాకుండా కారు గుర్తుకు ఓటు వేయండి. ఏమిచ్చింది ఈ ప్రజలకు బీజేపీ,బిఎస్ఎంఎల్ ఉద్యోగులను ఊడగొట్టింది అని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా విశ్వ కర్మలు గొప్పవాళ్ళు. మన ప్రభుత్వానికి అండగా వుండి అభివృద్ధికి ఓటు వేద్దాం. మలబర్ సంస్థ వాళ్ళు మన విశ్వ కర్మలకు ఉపాధి కల్పిస్తామన్నారు. నిన్నటిదాకా పనిచేసిన మంత్రి నిర్లక్ష్యం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తి చేయలేదు. గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి ,ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించి ఇష్టం. బీజేపీ ఈ రాష్ట్రం లోఅధికారంలో లేదు,వచ్చే అవకాశం లేదు. రాజేందర్ ఇచ్చే డబ్బులు కాదు,బతుకులు కావాలి. చకలెట్లు,పిప్పరమెంట్లు ఇస్తే మోసపోయే గడ్డ కాదు హుజురాబాద్ గడ్డ. టిఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు.