Harish Rao: పేరు గొప్ప ఊరు దిబ్బ.. గవర్నర్ వ్యాఖ్యలపై కౌంటర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Counter To Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఒక డాక్టర్ అయ్యుండి, వైద్యుల మనోభావాలు దెబ్బతీసేలా ఆమె మాట్లాడం బాధాకరమన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే.. మీరు విమర్శిస్తున్నారు’ అంటూ గవర్నర్‌పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని వైద్యారోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఎయిమ్స్ బీబీ నగర్ ఆసుపత్రిలో కనీస వసతులు కూడా లేవని.. దాన్ని ఒకసారి సందర్శించి, ఆ తర్వాత తమ వైద్యారోగ్య వ్యవస్థపై మాట్లాడండి అని హరీష్ రావు సూచించారు.
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉన్న సౌకర్యాల్లో.. 10 పైసలు కూడా ఎయిమ్స్‌లో లేవని ఎద్దేవా చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఎయిమ్స్ తయారైందని విమర్శించారు. ఆ ఎయిమ్స్‌లో లేరు, డెలివరీలు కావు, కనీస సౌకర్యాలే ఉండవని పేర్కొన్నారు. డాక్టర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా గవర్నర్ తమిళిసై మాట్లాడటం, నిజంగా బాధాకరమని మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఓ ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరుతున్నారని గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు పై విధంగా స్పందించారు. తమిళిసై వ్యాఖ్యలను అధికార నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం తప్పుపట్టారు.
Also Read
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!