తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి చురుగ్గా పాల్గొంటున్నారు. ఐదో విడుత పల్లె ప్రగతిలో మోరీలను సాఫ్ చేస్తూ.. పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ..ప్రజలను భాగస్వాములను చేస్తూ.. ఉత్తేజ పరుస్తూ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా…