Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్‌లో జరిగిన ఘటన ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Varma: సినీ పరిశ్రమ బయట నుంచి చూస్తే రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. అయితే ఆ రంగుల వెనుక ఎన్నో అనుభవాలు, తిరస్కారాలు, అవమానాలు కూడా దాగి ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ అనే అంశం గురించి ఎక్కువగా హీరోయిన్స్ మాట్లాడుతుంటారు. అయితే ఈ సమస్య మహిళలకే పరిమితం కాదని, మగవాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారని మరోసారి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ వెల్లడించారు. హీరోగా గుర్తింపు రాకముందు తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఆయన రీసెంట్ గా పంచుకోవడంతో ఈ మ్యాటర్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో విజయ్ వర్మ ఒకరు. విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, నటుడిగా స్థిరపడే ముందు ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో నటనపై ఆసక్తితో పాటు మోడలింగ్‌లో కూడా అవకాశాలు వెతుకుతున్న రోజుల్లో ఒక మోడల్ కోఆర్డినేటర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించారు.
ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ విజయ్ వర్మ మాట్లాడుతూ, తాను అప్పట్లో చిన్న స్థాయిలో మోడలింగ్ ప్రయత్నాలు చేస్తున్నానని, ఆ సమయంలో పరిచయమైన ఒక కోఆర్డినేటర్ తనను అనుచితంగా తాకడానికి ప్రయత్నించాడని చెప్పారు. ఆ ప్రవర్తన చూసి షాక్‌కు గురయ్యానని, వెంటనే అతడిని నిలదీశానని వెల్లడించారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారికి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే చాలా త్వరగా నిరుత్సాహానికి గురవుతారని, కానీ తాను భయపడకుండా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నానని వివరించారు. అంతటితో తన పోరాటం ముగియలేదని విజయ్ చెప్పారు. నటుడిగా మారాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని సూత్రధార్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో చేరాలని ప్రయత్నించినప్పుడు కూడా మొదట తనను తీసుకోలేదని గుర్తుచేసుకున్నారు. దీంతో మరింత కష్టపడాలనే పట్టుదలతో ముందుకు వెళ్లానని అన్నారు.
Also Read
ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు విజయ్ వర్మ. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రతి పాత్రలో కొత్త కోణాన్ని చూపించే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యపై చర్చకు దారితీశాయి. అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారికి ఎదురయ్యే పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో ఆయన అనుభవం మరోసారి గుర్తు చేసింది. అయినప్పటికీ లక్ష్యంపై నమ్మకం కోల్పోకుండా, ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తేనే విజయాన్ని అందుకోవచ్చని విజయ్ వర్మ ప్రయాణం స్పష్టంగా చెబుతోంది.
- Tags
- cinema
- Vijay Varma
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!