Metro Staff: మెట్రో టికెటింగ్ ఉద్యోగుల సమ్మెకు ఎండ్ కార్డు పడింది. అయితే వారు చేసిన డిమాండ్ మాత్రం ఒక్కటి మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు అధికారులు. మెట్రో సిబ్బందికి నెలరోజుల తర్వాత ట్రైన్ యాక్సిస్ ఇస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే జీతాలు పెంచమని ఖరాకండిగా తేల్చి చెప్పింది. అంతేకాకుండా సమ్మె విరమించి విధులకు హాజరుకాకపోతే ఉద్యోగాలను తొలగిస్తామని హెచ్చరించింది. దీంతో చేసేదేమిలేక మెట్రో టికెటింగ్ ఉద్యోగులు సమ్మెను విరమించారు. విధులకు హాజరయ్యారు. ట్రైన్ యాక్సిస్ మాత్రమే ఇస్తామనడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు కూడా పెంచాలని భావోద్వేగానికి గురయ్యారు. చాలి చాలని జీతాలతో విధులకు వస్తున్నామని అధికారులు జీతాలుకూడా పెంచాలని కోరుకుంటున్నారు. మరి దీనిపై మెట్రో అధికారులు స్పందించి మెట్రో ట్రైన్ యాక్సిస్ తో పాటు రానున్న కాలంలో జీతాలు పెంచుతారా? లేక ట్రైన్ యాక్సిస్ మాత్రమే ఇస్తారా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఏకధాటిగా పనిచేస్తున్న వారిని గుర్తించాలని చేసిన సమ్మె ఇవాల్టితో ముగిసినట్టేనా? మన జీతాలు ఎప్పటికి పెరగవా? అంటూ మెట్రో టికెటింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ విధులకు హాజరవుతున్నారు.!
Read also: Kamareddy New Master Plan: కొత్త మాస్టర్ ప్లాన్ వెనక్కి తీసుకోకపోతే ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం
తమకు ప్రస్తుతం ఉన్న రూ.11 వేలు నుంచి రూ.20 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి తమకు జీతాలు పెంచడం లేదని స్టేషన్లలోని టికెట్ కౌంటర్, మెయింటెనెన్స్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వాపోయారు. చాలీచాలని జీతాలు ఇవ్వడమే కాకుండా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని, ఉద్యోగం చేస్తుంటే రిలీవర్ సమయానికి రాకపోతే పట్టించుకోవడం లేదన్నారు. ఒక్కోసారి తినడానికి కూడా సమయం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్‌లో విధులకు హాజరుకాకుండా ధర్నా చేస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని మెట్రో సిబ్బంది వాపోతున్నారు. నిన్న కూడా విధులకు హాజరుకాకుండా నాగోల్ మెట్రో డిపో వద్ద నిరసన తెలిపారు.
Read also: Amigos: ఇదెక్కడి మేకోవార్ రా మావా… కళ్యాణ్ రామ్ ని గుర్తు పట్టడం కూడా కష్టమే
సిబ్బంది ధర్నాతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని భావించిన యాజమాన్యం పది మంది సిబ్బందిని ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)కి చర్చల కోసం ఆహ్వానించింది. సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ, కియోలిస్, ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు టికెటింగ్ సిబ్బందితో చర్చలు జరిపారు. కార్మికులు తమ వేతనాల పెంపు, మెట్రోలో ఉచితంగా యాక్సెస్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ లపై పట్టుబట్టారు. వేతనాల పెంపునకు సంబంధించి ఏజెన్సీలు కొంత సమయం కోరినట్లు చర్చల్లో పాల్గొన్న TCMO తెలిపింది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఇతర కారిడార్లలో టిక్కెట్టు ఇచ్చే సిబ్బందితో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. టికెటింగ్ సిబ్బంది లేకపోవడంతో మెట్రో స్టేషన్లలో స్టేషన్ కంట్రోలర్లు, ఇతర సిబ్బంది టిక్కెట్లు జారీ చేశారు. చర్చలు అసంపూర్తిగా ఉన్నందున ఈరోజు భారీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే..